| Daily భారత్
Logo




నీ భార్యను నాకు ఇచ్చేయ్.. జీవితాంతం సుఖంగా చూసుకుంటా

News

Posted on 2025-02-17 15:50:53

Share: Share


నీ భార్యను నాకు ఇచ్చేయ్.. జీవితాంతం సుఖంగా చూసుకుంటా

మహిళ భర్త ఎదుట ప్రపోజల్ పెట్టిన ప్రియుడు

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: పెళ్ళైన మహిళ  భర్తతో నీ పెళ్లాన్ని నాకు ఇచ్చేయ్.. ఇద్దరం సంతోషంగా జీవిస్తాం అంటూ ప్రియురాలు ఇంటి ముందు పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న ఘటన హైదరాబాద్‌లోని మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

పోలీసుల వివరాల ప్రకారం.. విశాఖపట్టణం సమీపంలోని ఆనందపురానికి చెందిన ఇద్దరు దంపతులు.. సినిమాలపై మక్కువతో నాలుగేళ్ళ క్రితం హైదరాబాద్‌కు యూసఫ్‌గూడ పక్కన యాదగిరినగర్‌లో నివాసం ఉంటున్నారు. ఇరువురు జూనియర్ ఆర్టిస్టులుగా పనిచేస్తున్నారు. సదరు మహిళకు, సమీప గ్రామానికి చెందిన లారీ డ్రైవర్ సూర్యనారాయణ(43 ) అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త పెరగటంతో, ఐదు రోజుల క్రితం సూర్యనారాయణ ఏకంగా సదరు మహిళ ఇంటికి వచ్చి వాళ్ళింట్లోనే ఉంటున్నాడు.. నా భార్య, కొడుకు, కూతురు నన్ను పట్టించుకోవడం లేదు అని వారితో చెప్పుకుంటూ బాధపడ్డాడు ఈ క్రమంలోనే సూర్యనారాయణకు, సదరు మహిళకు మధ్య చనువు పెరిగింది. 

ఆమెపై ఇష్టం పెంచుకున్నారు. శనివారం రాత్రి మద్యం సేవించి ఇంటికొచ్చి తన మనస్సులో ఉన్నదంతా దంపతుల ముందే చెప్పేశాడు. మీ ఆవిడ అంటే నాకు ప్రాణం.. ఆవిడ నా గుండె. ఆమె లేకపోతే నేనుండలేను. నాకు మీ ఆవిడ కావాలి. ఆమెను నాకుఇచ్చేయ్.. నాతో పంపించు.. జీవితాంతం సంతోషంగా ఉండేలా మీ ఆవిడ్ని నేను చూసుకుంటా అని ప్రియురాలి భర్తతో అన్నాడు. నా పెళ్ళాన్ని ఇవ్వమని నన్నే అడుగుతావా అంటూ సదరు మహిళ భర్త ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం అతడ్ని ఇంటి నుంచి గెంటేశాడు. 

రాత్రి ఆ ఇంటి బయటే నిద్రించిన సూర్యనారాయణ.. ఆదివారం తెల్లవారుజామున యూసుఫ్ గూడ పోలీస్ బెటాలియన్ పెట్రోల్ బంకుకు వెళ్లి.. పెట్రోల్‌ను కొని ప్రియురాలి ఇంటి ఎదుట.. పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు పోలీసులకు, అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు. విషయం తెలిసిన వెంటనే స్పాట్‌కు వచ్చిన పోలీసులు.. అతన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సూర్యనారాయణ మృతి చెందాడు. ఈ ఘటనపై మధురానగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Image 1

ఖమ్మం జిల్లా ఎన్సీపీ పార్టీ జిల్లా టీంతో సమావేశమైన మద్దిశెట్టి సామేలు

Posted On 2026-08-26 11:21:46

Readmore >
Image 1

పచ్చదనం కోసం మన అడుగు.. భవిష్యత్ తరాల కోసం మన బాధ్యత!

Posted On 2026-08-25 17:42:46

Readmore >
Image 1

యంగ్ ఇండియా పాఠశాలను జిల్లా కేంద్రంలోనే ఏర్పాటు చేయాలి

Posted On 2026-08-25 17:40:44

Readmore >
Image 1

కామారెడ్డి నియోజకవర్గంలో పలువురు పీఏసీఎస్‌ చైర్మన్ల నియామకం

Posted On 2026-08-25 17:39:09

Readmore >
Image 1

రాజన్న ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా కొంపల్లి మహేష్ ఏకగ్రీవ ఎన్నిక

Posted On 2026-08-25 10:02:35

Readmore >
Image 1

కుసుమ రామయ్య ZPHS విద్యార్థుల NCC క్యాంపు ప్రయాణం - "A" సర్టిఫికెట్ దిశగా అడుగులు

Posted On 2026-08-25 07:42:04

Readmore >
Image 1

మతం మారాలని సౌజన్యపై సాధిక్‌ ఒత్తిడి తెచ్చాడు: కాకినాడ ఎస్పీ

Posted On 2026-08-25 03:53:32

Readmore >
Image 1

వన మహోత్సవం లక్ష్యాలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలి

Posted On 2026-08-24 15:21:21

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన టాక్స్ ఆఫీసర్, సీనియర్ అసిస్టెంట్!

Posted On 2026-08-24 14:47:32

Readmore >
Image 1

రేగా కు ఘన స్వాగతం పలికిన నియోజకవర్గ ప్రజలు

Posted On 2026-08-24 14:33:25

Readmore >