| Daily భారత్
Logo




ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే పై పోలీస్ కేసు

News

Posted on 2025-02-18 04:17:02

Share: Share


ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే పై పోలీస్ కేసు

ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డా. రామ చంద్రు నాయక్ పై పోలీస్ కేసు...

A2 నిందితుడేనని సూర్యాపేట పోలీసుల వెల్లడి

డైలీ భారత్, సూర్యాపేట: సూర్యాపేట పట్టణంలో ఒక వ్యక్తి సంబందించిన భూమిని ఉద్దేశ పూర్వకంగా భూకబ్జా చేసి  వారిపై దాడులకు డోర్నకల్ ఎమ్మెల్యే డా.  రామ చంద్రు నాయక్ పాల్పడుతున్నారని సూర్యాపేట టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.

వివాదస్పద భూమి కొనుగోలు

సూర్యాపేట జిల్లా కేంద్రం బెచిరాగ్ మాదారం రెవెన్యూ గ్రామం శివారులోని సర్వే నెంబర్ 232,  356 లో రద్దు అయిన పట్టాదార్ పాస్ బుక్ ద్వారా నలగాటి ప్రసాద్ రాజు అనే వ్యక్తి నిషేదిత భూములు జాబితలో ఉన్న భూమిని తన పరపతిని ఉపయోగించి సూర్యాపేట సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు బాధితులు చెప్పారు. ఇది వరకే అమ్మకం దారులయిన ఆనంతుల రామ చంద్రయ్య కుటుంబ సభ్యులకు ఏ విధమైన హక్కులు లేవని, భూమి కబ్జాలో లేరని, వారు తీసుకున్న పాస్ బుక్స్ నఖీలవని జిల్లా జాయింట్ కలెక్టర్, ఆర్.డి.ఓ లు నిర్దారించారు. ఆర్.డి.ఓ ఆ నఖీలి పాస్ బుక్ రద్దు చేసి తగు చర్యల కోసం ఎల్. ఆర్ నెంబర్ : D/1165/2010 తేది : 14-12-2010 ప్రకారం  సూర్యాపేట సబ్ రిజిస్టర్ ఆఫీస్ కి పంపారు. అట్టి భూమి నిషేధత భూముల జాబితలో ప్రకటించారు. అయినప్పటికీ డా. రామ చంద్రు నాయక్ అప్పటి సబ్ రిజిస్టార్ ను ప్రలోభపెట్టి నలగాటి ప్రసాద్ రాజు అనే వ్యక్తి ద్వారా డాక్యుమెంట్ నెంబర్ : 3052/2013 తేదీ : 11-3-2013న డా. రామచంద్రు నాయక్ రిజిస్ట్రేషన్ చేపించుకున్నాడని  బాధితుడు నర్సింహా రావు వివరించారు. వివాదంలో ఉన్న అట్టి ఆస్థి తప్పుడు పద్ధతుల్లో వచ్చినట్లు ఎవరు చెప్పిన వినకుండా రిజిస్టర్ చేపించుకొని ఆయా భూమిని కబ్జా చేసే ప్రయత్నం చేసాడని  బాధితుడు హైకోర్టుకు తన అక్రందన వెలిబుచ్చాడు.

తన భూమిని ఎమ్మెల్యే కబ్జా ప్రయత్నం చేస్తున్నాడు.

మా భూమిని  తప్పుడు పత్రాలు సృష్టించుకొని గత కొన్ని సంవత్సరాల నుండి డోర్నకల్ ఎమ్మెల్యే డా. రామ చంద్రు నాయక్ కబ్జా ప్రయత్నం చేస్తున్న నేపధ్యాన్ని తాము ఎప్పటికప్పుడు అడ్డుకుంటున్నాని భూమి హక్కు దారు గుండపనేని లక్ష్మి  నరసింహారావు @ సుధాకర్ రావు చెప్పారు. 

ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే హోదా అడ్డం పెట్టుకొని జనవరి 12 న ఆయన అనుచరులతో వచ్చి కబ్జా ప్రయత్నం చేసి మా  తమ్ముడు కొడుకు డా.చైతన్యను చంపెందుకు ప్రయత్నం చేసి, తమపై దాడులకు దిగారని సూర్యాపేట పోలీసులుకు పిర్యాదు చేయగా  సూర్యాపేట 2 టౌన్ పోలీసులు వారిపై కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. భూమి కబ్జా కోసం ప్రయత్నం చేస్తూ మమ్మల్ని ఎస్.సి, ఎస్టీ అట్రాసిటీ కేసులో ఇరికించేంందుకు ఎమ్మెల్యే డా. రామచంద్రు నాయక్ ప్రయత్నం చేస్తున్నాడని, మా మీద కౌంటర్ కేసు కోసం సూర్యాపేట పోలీసులను బ్లాక్మెయిల్ చేసెందుకు, మమ్మల్ని భయంబ్రాంతులకు లోను చేసేందుకు ఆయన ప్రయత్నం చేస్తున్నాడని, తనే ఆ భూమికి నిజం అయిన హక్కు దారుడనని తనకు ఆయా సర్వే నెంబర్ లో 50 గుంటల భూమి గత 30 సంవత్సరాలనుండి తన స్వాదీనంలో ఉందని అన్ని రికార్డ్ లతో గుండపనేని లక్ష్మి  నరసింహారావు @ సుధాకర్ రావు ఆవేదన వ్యక్తం చేస్తూ హైకోర్టుకు కౌంటర్ అఫిడవిట్ లో తెలిపారు.

భూమి హక్కునేపథ్యం....

సూర్యాపేటకు జిల్లా కేంద్రంకు చెందిన గుండపనేని లక్ష్మి  నరసింహారావు @ సుధాకర్ రావుకు సూర్యాపేట పట్టణంలో తనకున్న 50 గుంటల భూమి సర్వే నెంబర్ : 232లోని భూమిని డోర్నకల్ ఎమ్మెల్యే డా.జాటోత్ రామ చంద్రు నాయక్ అక్రమంగా తప్పుడు పత్రాలతో నిషేదిత భూముల జాభితలో ఉన్న ఒక సర్వే నెంబర్ తో రిజిస్ట్రేషన్ చేపించుకొని తరచుగా కబ్జా ప్రయత్నం చేస్తుండగా ఆయా 50 గుంటల భూమిని రక్షణగా పెన్ షింగ్ వేసుకొనే క్రమంలో జాటోత్ రామ చంద్రు నాయక్ కుట్ర పూరితంగా బాశపంగు బాస్కర్ తో పాటు మరో 10 మందితో వెళ్లి నరసింహ రావు సోదరుడు కుమారుడు అయిన డా. చెంతన్ చెత్తన్యపై నానా దురభాషలు ఆడుతూ దాడి చేసి భూ ఆక్రమణకు పాల్పడినట్లు సూర్యాపేట 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో క్రైమ్ నెంబర్ : 18/2025 తేది : 12-1-2025 న భారతీయ న్యాయ సంహిత - 2023 సెక్షన్ 189(2), 329(3), 352, 351(2) ప్రకారం కేసు నమోదు అయింది.  ఇట్టి భూమి వివాదంలో డా. రామ చంద్రు నాయక్ పై 2016 లో గతంలో క్రిమినల్ కేసు నమోదు అయినట్లు పోలీసులు చెప్పారు.

పోలీసుల ఆటంకం... సివిల్ వివాదంలో జ్యోక్యంపై రిట్

డోర్నకల్ ఎమ్మెల్యే డా. రామ చంద్రు నాయక్ తనకు చెందిన ఎల్.ఐ.సి రోడ్డులోని 1000 చదరపు గజాల భూమి విషయంలో పోలీసులు తనను ఆటంకపరిస్తున్నారని సివిల్ వివాదంలో పోలీసుల జోక్యం చేసుకుంటున్నారని ఆయన హైకోర్టును ఆశ్రయించినాడు.WP No : 3229/2025 ప్రకారం పిటిషన్ వేసారు.  సూర్యాపేట ఎస్పీ, డీఎస్పీ, స్టేషన్ హౌస్ ఆఫీసర్ లను ప్రతి వాదులుగా రిట్ పిటిషన్ దాఖలా చేసాడు. 

భూకబ్జాలో ఇంప్లీడ్ పిటిషన్

ఈ కేసులో డోర్నకల్ ఎమ్మెల్యే డా. రామ చంద్రు నాయక్ నిందితుడేనని సూర్యాపేట పోలీసులు తెలంగాణా హైకోర్టులో కౌంటర్ అఫిడవిట్ దాఖలా చేశారు. ఇట్టి కేసులోలో నిజమైన భూ హక్కు దారుడు గుండపనేని లక్ష్మి  నరసింహారావు @ సుధాకర్ రావు సైతం ఈ కేసులో  ఇంప్లీడ్ అయి మా భూమిని ఎమ్మెల్యే డా. రామ చంద్రు నాయక్ ప్రభుత్వ విప్ పదవిని అడ్డం పెట్టుకొని  ప్రశాంత వాతావరణాన్ని అశాంతి పాలు చేస్తూ తరచుగా మా భూమి కబ్జా చేసేందుకు ప్రయత్నం చేస్తూన్నాడని తనకు సంబందించిన హక్కు పత్రాలు తెలంగాణా హైకోర్టుకు నివేదించాడు. 

హైకోర్టుకు పోలీసుల జవాబు

ఈ విషయంలో  సూర్యాపేట పోలీసులు తమకు డయల్ 100 కాల్ బాధితులు చేయడంవల్ల  వివాదస్పద భూమి వద్దకు వెళ్ళమని, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్  తెలిసి ఆయా సాక్ష్యల సేకరించి కేసు నమోదు చేశామని, తాము ఎలాంటి సివిల్ తగదాల్లో ఉద్దేశ పూర్వక జోక్యం చేసుకోలేదని సూర్యాపేట పోలీసులు హైకోర్టు నివేదించారు. ఈ సందర్బంగా పిటిషనర్ అయిన డోర్నకల్ ఎమ్మెల్యే డా. రామ చంద్రు నాయక్ ను A2 గా చేర్చినట్లు కోర్టుకు తెలిపారు. ఈ కేసు  తదుపరి విచారణ ఫిబ్రవరి 25 రోజుకు వాయిదా వేశారు.

Image 1

ఖమ్మం జిల్లా ఎన్సీపీ పార్టీ జిల్లా టీంతో సమావేశమైన మద్దిశెట్టి సామేలు

Posted On 2026-08-26 11:21:46

Readmore >
Image 1

పచ్చదనం కోసం మన అడుగు.. భవిష్యత్ తరాల కోసం మన బాధ్యత!

Posted On 2026-08-25 17:42:46

Readmore >
Image 1

యంగ్ ఇండియా పాఠశాలను జిల్లా కేంద్రంలోనే ఏర్పాటు చేయాలి

Posted On 2026-08-25 17:40:44

Readmore >
Image 1

కామారెడ్డి నియోజకవర్గంలో పలువురు పీఏసీఎస్‌ చైర్మన్ల నియామకం

Posted On 2026-08-25 17:39:09

Readmore >
Image 1

రాజన్న ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా కొంపల్లి మహేష్ ఏకగ్రీవ ఎన్నిక

Posted On 2026-08-25 10:02:35

Readmore >
Image 1

కుసుమ రామయ్య ZPHS విద్యార్థుల NCC క్యాంపు ప్రయాణం - "A" సర్టిఫికెట్ దిశగా అడుగులు

Posted On 2026-08-25 07:42:04

Readmore >
Image 1

మతం మారాలని సౌజన్యపై సాధిక్‌ ఒత్తిడి తెచ్చాడు: కాకినాడ ఎస్పీ

Posted On 2026-08-25 03:53:32

Readmore >
Image 1

వన మహోత్సవం లక్ష్యాలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలి

Posted On 2026-08-24 15:21:21

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన టాక్స్ ఆఫీసర్, సీనియర్ అసిస్టెంట్!

Posted On 2026-08-24 14:47:32

Readmore >
Image 1

రేగా కు ఘన స్వాగతం పలికిన నియోజకవర్గ ప్రజలు

Posted On 2026-08-24 14:33:25

Readmore >