| Daily భారత్
Logo




తెలంగాణలో వేడెక్కిన జీహెచ్ఎంసీ రాజకీయం

News

Posted on 2025-02-09 15:14:56

Share: Share


తెలంగాణలో వేడెక్కిన  జీహెచ్ఎంసీ రాజకీయం

డైలీ భారత్, హైదరాబాద్ : గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్ రాజకీయం వేడెక్కింది. మేయర్‌పై అవిశ్వాస తీర్మానానికి కౌంట్ డౌన్ షురూ అయింది. రేపటికి బల్దియా పాలక మండలికి నాలుగేళ్లు పూర్తి అవుతుంది. ఫిబ్రవరి 11 తర్వాత ఏ క్షణమైనా జీహెచ్ఎంసీ మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్‌ మోతె శ్రీలత శోభన్‌ రెడ్డిలపై అవిశ్వాసం పెట్టే అవకాశం ఉంది. బీజేపీ తెలంగాణ అధ్యక్షులు కిషన్ రెడ్డితో జీహెచ్ఎంసీ బీజేపీ కార్పొరేటర్లు ఇవాళ (ఆదివారం) సమావేశం అయ్యారు. రెండు రోజుల్లో మాజీ మంత్రి కేటీఆర్‌తో బీఆర్ఎస్ కార్పొరేటర్లు సమావేశం కానున్నారు. మేయర్ విజయలక్ష్మిపై అవిశ్వాసానికి బీఆర్ఎస్ కార్పొరేటర్లు పట్టుబడుతున్నారు. బీజేపీ, బీఆర్ఎస్ కార్పొరేటర్ల సమావేశాలతో కాంగ్రెస్ అలర్ట్ అయింది. ఎల్లుండి మేయర్‌తో కాంగ్రెస్ కార్పొరేటర్లు సమావేశం కానున్నారు. అవిశ్వాస తీర్మానంపై అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించే అవకాశం ఉంది.

వ్యూహాలు రచిస్తున్న బీఆర్ఎస్...

కాగా, మేయర్‌ గద్వాల విజయలక్ష్మిపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని బీఆర్‌ఎస్‌ యోచిస్తోంది. తమ పార్టీ తరఫున కార్పొరేటర్‌గా గెలిచి జీహెచ్‌ఎంసీ మేయర్‌ పదవిని చేపట్టిన విజయలక్ష్మి.. కాంగ్రెస్‌లోకి మారిన నేపథ్యంలో ఈ ఆలోచన చేస్తోంది. తద్వారా రాజకీయంగా గ్రేటర్‌ హైదరాబాద్‌పై పట్టు నిలుపుకొనే వ్యూహాలు రచిస్తోంది. ఇందుకు సంబంధించి సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తోంది. ఈ మేరకు కొన్ని రోజుల క్రితం జూబ్లీహిల్స్‌లోని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్‌ నివాసంలో గ్రేటర్‌ పరిధిలోని ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సమావేశమైన విషయం తెలిసిందే.

మద్దతు కూడగట్టడంపై కసరత్తు..

ఈ సందర్భంగా మేయర్‌పై అవిశ్వాసం విషయంపై సుదీర్ఘంగా చర్చించారు. పార్టీకి ప్రస్తుతం ఉన్న బలం ఎంత? ఇతర సభ్యుల మద్దతు కూడగట్టడం ఎలా? అన్న అంశాలపై ఈ భేటీలో మాట్లాడారు. గ్రేటర్‌పై పట్టు జారలేదన్న సంకేతాలిచ్చేలా అవిశ్వాసం ఉండాలని, ఒకవేళ తగినంత మంది సభ్యుల మద్దతులేక అవిశ్వాసం వీగిపోతే.. ప్రతికూల పరిణామాలు ఉంటాయన్న అభిప్రాయమూ వ్యక్తమైనట్టు సమాచారం. అవిశ్వాసం పెట్టాలా? వద్దా? అన్నదానిపై తుది నిర్ణయం తీసుకుంటామని ఓ ఎమ్మెల్యే తెలిపారు..

Image 1

పచ్చదనం కోసం మన అడుగు.. భవిష్యత్ తరాల కోసం మన బాధ్యత!

Posted On 2026-08-25 17:42:46

Readmore >
Image 1

యంగ్ ఇండియా పాఠశాలను జిల్లా కేంద్రంలోనే ఏర్పాటు చేయాలి

Posted On 2026-08-25 17:40:44

Readmore >
Image 1

కామారెడ్డి నియోజకవర్గంలో పలువురు పీఏసీఎస్‌ చైర్మన్ల నియామకం

Posted On 2026-08-25 17:39:09

Readmore >
Image 1

రాజన్న ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా కొంపల్లి మహేష్ ఏకగ్రీవ ఎన్నిక

Posted On 2026-08-25 10:02:35

Readmore >
Image 1

కుసుమ రామయ్య ZPHS విద్యార్థుల NCC క్యాంపు ప్రయాణం - "A" సర్టిఫికెట్ దిశగా అడుగులు

Posted On 2026-08-25 07:42:04

Readmore >
Image 1

మతం మారాలని సౌజన్యపై సాధిక్‌ ఒత్తిడి తెచ్చాడు: కాకినాడ ఎస్పీ

Posted On 2026-08-25 03:53:32

Readmore >
Image 1

వన మహోత్సవం లక్ష్యాలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలి

Posted On 2026-08-24 15:21:21

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన టాక్స్ ఆఫీసర్, సీనియర్ అసిస్టెంట్!

Posted On 2026-08-24 14:47:32

Readmore >
Image 1

రేగా కు ఘన స్వాగతం పలికిన నియోజకవర్గ ప్రజలు

Posted On 2026-08-24 14:33:25

Readmore >
Image 1

జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన పోలీస్ అధికారుల సంఘం నూతన కార్యవర్గం

Posted On 2026-08-24 14:25:56

Readmore >