Posted on 2024-11-04 14:33:57
జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ తో కలిసి దత్తాత్రేయ స్వామి ఆలయ దర్శనం
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: బోయినిపల్లి మండలం వరదవెల్లిలోని దత్తాత్రేయ స్వామి ఆలయానికి వెళ్లే భక్తులకు బోట్ సేవలు అందుబాటులోకి తీసుకువచ్చామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. బోయినిపల్లి మండలం వరదవెల్లి విచ్చేసిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి స్థానిక గ్రామ దేవత పోచమ్మ తల్లిని సోమవారం దర్శించుకున్నారు. అనంతరం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తో కలిసి బోట్ సేవలను ప్రారంభించారు.
జిల్లా కలెక్టర్ తోపాటు స్వయంగా బోట్ లో వెళ్లి దత్తాత్రేయ స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ బోట్ సేవలు అందుబాటులోకి రావడంవల్ల ప్రజలకు ఎంతో ఉపయోగంగా ఉంటుందని చెప్పారు. అందరూ దత్తాత్రేయ స్వామిని దర్శించుకోవడంతోపాటు ప్రతి ఒక్కరూ స్వామి ఉత్సవాల్లో సంతోషంగా పాల్గొనే అవకాశం లభించిందని పేర్కొన్నారు.
తెలుగు సాహిత్యానికి ప్రజాకవి కాళోజీ సేవలు చిరస్మరణీయం... ఎస్పీ మహేష్ బి.గితే
Posted On 2026-09-09 08:34:54
Readmore >
నామకరణ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర డైరెక్టర్ ఆర్.టి.ఐ చట్టం... ఎంఎ సలీం
Posted On 2026-09-08 18:02:08
Readmore >
కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం
Posted On 2026-09-07 16:41:28
Readmore >
దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-09-06 04:06:38
Readmore >