| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఆత్మహత్య చేసుకున్న నారాయణ కాలేజ్ విద్యార్థిని

ఆత్మహత్య చేసుకున్న నారాయణ కాలేజ్ విద్యార్థిని

డైలీ భారత్, బాచుపల్లి: బాచుపల్లి నారాయణ కాలేజీలో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న అనూష దసరా సెలవులకు వెళ్లి... తిరిగి హాస్టల్‌కు వచ్చి సూసైడ్ చేసుకుంది. తల్లిదండ్రులు దగ్గరుండి హాస్ట‌ల్‌లో వదిలి వెళ్లిన కాసేపటికే బలవన్మరణానికి పాల్పడింది. హాస్టల్‌లో వదిలి.. సిటీ దాటే లోపే అనూష స్పృహ కోల్పోయిందని కాలేజీ యాజమాన్యం తల్లిదండ్రులకు సమాచారం అందించింది.

అయితే వారు కాలేజీకి వెళ్లే సరికి అనూష ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుందని యాజమాన్యం తెలిపింది. అంతేకాకుండా ఆమె తల్లిదండ్రులు వచ్చేలోపే కళాశాల సిబ్బంది, బాచుపల్లి పోలీసులు అనూష మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఇక, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు.

Previous ఢిల్లీలో సీఆర్పీఎఫ్ స్కూల్ వద్ద పేలుడు, ఓ కారు ధ్వంసం - హై అలర్ట్
Next నూతన ఉస్మానియా యూనివర్సిటీ దళిత ఉపకులాపతి కి రాష్ట్ర జేఏసీ నేతల సన్మానం
ADVERTISEMENT