| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

రూ. 40 కోట్లతో నిర్మిస్తున్న రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన కాంగ్రెస్ నేతలు

రూ. 40 కోట్లతో నిర్మిస్తున్న రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన కాంగ్రెస్ నేతలు

ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కు ధన్యవాదాలు తెలిపిన కాంగ్రెస్ నేతలు

డైలీ భారత్ రంగారెడ్డి జిల్లా: షాద్ నగర్ చౌరస్తా నుంచి రాయికల్ వై జంక్షన్ వరకు 4.8 కిలోమీటర్స్ 40 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మిస్తున్న బీటీ రోడ్డు పనులు ఫైనల్ కోటింగ్ వేస్తున్న సందర్భంగా కాంట్రాక్టర్ తో కలిసి పనులను పరిశీలించిన కాంగ్రెస్ నాయకులు. స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చొరవతో ముమ్మరంగా కొనసాగుతున్న రోడ్డు పనులను కాంగ్రెస్ నాయకులు శనివారం సందర్శించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ఆదేశాలతో అధికారులు త్వరగా తిన పనులు పూర్తి చేస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఎంతో చొరవతో రోడ్డు విస్తరణ పనులను పూర్తి చేయిస్తున్నందుకు వారికి కూడా కార్యకర్తలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు కే చెన్నయ్య, తిరుపతి రెడ్డి, బాలరాజ్ గౌడ్, బసవనప్ప, ఆదివాసి గిరిజన నాయకుడు శీను నాయక్, తుపాకుల శేఖర్, ఖదీర్, లింగారెడ్డి గూడా అశోక్, ఆగిరి శేఖర్, విజయ్ కుమార్ రెడ్డి, గంగ, అర్జున్ లక్ష్మణ్, దిలీప్ కుమార్,శ్రీను,రాజు, గంగ ముని సత్తయ్య, అనిల్, జగదీష్ ముదిరాజ్, తదితరులు పాల్గొన్నారు..

Previous మహిళల ఆత్మరక్షణకు కర్ర సాము అవసరం : జిల్లా కోర్టు సీనియర్ సివిల్ జడ్జి రాధికా జైస్వాల్
Next భధ్రాద్రి కొత్తగూడెం బీఆర్ఎస్ పార్టీ జిల్లా సమావేశంలో పాల్గోన్న జిల్లా అధికార ప్రతినిధి లాకావత్ గిరిబాబు
ADVERTISEMENT