| Daily భారత్
Logo




రూ. 1 కోటి ప్రభుత్వ నిధులతో చౌడమ్మ గుట్ట హనుమాన్, ఎలికట్ట భవాని ఆలయాల అభివృద్ధి : ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

News

Posted on 2024-10-19 11:32:08

Share: Share


రూ. 1 కోటి ప్రభుత్వ నిధులతో చౌడమ్మ గుట్ట హనుమాన్, ఎలికట్ట భవాని ఆలయాల అభివృద్ధి : ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

షాద్‌నగర్ నియోజకవర్గానికి చౌడమగుట్ట హనుమాన్, ఎలికట్ట భవాని మాత, రామలింగేశ్వర స్వామి దేవాలయాలు ఎంతో మహిమాన్విత్వమైన గొప్ప ఆలయాలని వీటి అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం శక్తి వంచన లేకుండా కృషి చేస్తుందని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. స్థానిక చౌడమ్మ గుట్ట దేవాలయంలో శనివారం ఆలయ అభివృద్ధి కోసం స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తదితర కౌన్సిలర్లు నగర ప్రముఖులు వ్యాపారస్తులు తదితర భక్తులు పెద్ద ఎత్తున శ్రీకారం చుట్టారు. చౌడమ్మ గుట్ట హనుమాన్ దేవాలయానికి ప్రభుత్వం తరఫున 50 లక్షల రూపాయలు మంజూరు చేయించడం జరిగిందని, దీనికోసం పట్టణ వ్యాపారవేత్త ఆకుల వెంకటేశం, అరుణ దంపతుల కుమారుడు కీర్తిశేషులు ఆకుల రాఘవేందర్ జ్ఞాపకార్థం 10 లక్షల రూపాయల చెక్కును ఎమ్మెల్యే చేతుల మీదుగా ఆలయ కమిటీ సభ్యులు పులిమామిడి శ్రీశైలం గౌడ్ కు అందజేశారు. ప్రత్యేక పూజల అనంతరం ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ.. భక్తి మార్గం ముక్తిని ప్రసాదించడమే కాదు.. మనిషిలో సేవాభావాన్ని పెంచుతుంది.. సేవా భావమే మనలో శక్తిని పెంచి విజయవంతంగా ముందుకు నడిపిస్తుందనీ.. అందుకే అందరూ ఆధ్యాత్మిక మార్గంలో నడవాలన్నారు. ఆ దైవాన్ని నమ్ముకుని మన పనిని మనం చిత్తశుద్ధిగా చేసుకోవాలి. అప్పుడే అనుకున్న విజయాన్ని అందుకోగలుగుతాం.. అని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. షాద్ నగర్ పరిధిలో అత్యధిక శాతం భక్తులు మహిమాన్విత ఆలయాలుగా చౌడమ్మ గుట్ట, ఎలికట్ట భవాని మాత ఆలయాలకు అభివృద్ధి నిమిత్తం ఒక్కో ఆలయానికి ఐదు లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తులోనూ ఆలయ అభివృద్ధికి పూర్తిస్థాయిలో సహకరిస్తానని వెల్లడించారు. ఆలయ పాలకవర్గం దేవుడి నుంచి డబ్బులు ఆశించకుండా అంకిత భావంతో సేవలు అందించాలన్నారు. ఆలయ అభివృద్ధికి నిరంతరం సహకరిస్తున్న పులిమామిడి శ్రీశైలం గౌడ్, వెంకటేశం, యంసాని శ్రీనివాస్ తదితర కుటుంబాలకు ఆ దేవుడు మంచి చేయాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. ఆలయ పరిధిలో పల్లకి సేవ తదితర కార్యక్రమాలు ఎంతో ఆసక్తికరంగా సాగుతున్నాయని పాలకవర్గం, అర్చకులు అద్భుతంగా పనిచేస్తున్నారని ప్రశంసించారు. ఈ ఆలయ అభివృద్ధికి సహకరిస్తున్న, ఆలయాన్ని సందర్శిస్తున్న ప్రతి ఒక్కరి పైన ఆంజనేయస్వామి దీవెనలు ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు స్పష్టం చేశారు. 


*దేవుడిచ్చిన శక్తి మంచికి ధారపోద్దాం* 


అన్ని జన్మల్లో మానవ జన్మ ఎంతో గొప్పని దేవుడు సర్వంతర్యామి అని ఆయన ఆజ్ఞ లేకుండా ఎవరు ఏం చేయలేరని ప్రతి ఒక్కరు ఆధ్యాత్మిక చింతనతో సన్మార్గంలో నడవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎమ్మెల్యే శంకర్ ఆధ్యాత్మిక ధోరణితో మాట్లాడారు. ఈ సృష్టిలో పదవులు రాజకీయాలు శాశ్వతం కాదని భగవంతుడు ఇచ్చిన శక్తిని తిరిగి మానవుల క్షేమం కోసం ఆ శక్తిని ధారపోయడమే మానవ జన్మ సార్ధకమని అన్నారు. ఈ సృష్టిలో భగవంతుని నమ్మేవారు ఉన్నారు నమ్మనివారు కూడా ఉన్నారని అయితే నమ్మని మూర్ఖుల గురించి మాట్లాడుకోవడం వ్యర్థమని, అలాగే దుర్మార్గాల వైపు నడిచే దుష్టులకు ఆ దేవుడు మంచి జ్ఞానం కల్పించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. ఆలయ అభివృద్ధి కమిటీ నిర్వాహకుడు పులిమామిడి శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ.. ఆలయ అభివృద్ధి కోసం ఎప్పుడూ ఎవరిని చేయించాచి విరాళాలు అడగలేదని ఆ దేవుడే భక్తుల మదిలో భక్తిని పుట్టించి ఆయనే ఆలయ అభివృద్ధికి దోహదపడుతున్నారని శ్రీశైలం అన్నారు. భక్తులు సొంతంగా వచ్చి ఇక్కడ విరాళాలు సమర్పించడం జరుగుతుందని ఆ స్వామి స్వయంగా భక్తుల మదిలో తన కావలసిన కార్యక్రమాలు చేసుకుంటారని ఆధ్యాత్మిక ధోరణితో మాట్లాడారు. అనంతరం ఆలయంలో ఎమ్మెల్యే శంకర్ గోవును పూజించారు. మాజీ జెడ్పిటిసి వెంకటరామిరెడ్డి, మాజీ ఎంపీటీసీలు భార్గవ్ కుమార్ రెడ్డి, ఎలికట్ట శ్రీశైలం, తుపాకుల శేఖర్, మాజీ మున్సిపల్ చైర్మన్ అగ్గునూరు విశ్వం, మండల పార్టీ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి, అగ్గునూరు బస్వం, పట్టణ అధ్యక్షుడు కొంకల్ల చెన్నయ్య, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బాలరాజు గౌడ్, రఘుమా రెడ్డి, కౌన్సిలర్లు విశాల విశ్వం, కృష్ణవేణి, లతా శ్రీశైలం, వర్ష, ఆలయ భక్తులు ఎంసాని శ్రీనివాస్, ఏంసాని నరసింహులు, రాయికల్ శీను, గడ్డమీది రమేష్, పెద్ది రామ్మోహన్, బాల రాజేష్, ప్రవీణ్ యాదవ్, బండి మాణిక్యం లింగారెడ్డిగూడెం అశోక్, యాదగిరి, లక్ష్మయ్య, తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు..

Image 1

రాజన్న ఆలయ గోశాలకు వరిగడ్డి వితరణ

Posted On 2026-04-25 22:35:25

Readmore >
Image 1

పెట్రోల్, డీజిల్ నిల్వలపై ఆందోళన వద్దు : కలెక్టర్ కృతిక శుక్ల

Posted On 2026-04-25 22:28:14

Readmore >
Image 1

కానిస్టేబుల్‌ భార్య, అతడి కుమారుడ్ని కత్తితో పొడిచి చంపిన ప్రియురాలు

Posted On 2026-04-25 21:27:36

Readmore >
Image 1

ఆర్థిక మోసం కేసులో మంగ్లీ పాత్రపై దర్యాప్తు ముమ్మరం

Posted On 2026-04-25 20:38:22

Readmore >
Image 1

మంజుల కలం – ఆకలిపై అక్షర యజ్ఞం

Posted On 2026-04-25 19:28:22

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా : బాల్య వివాహం... అడ్డుకున్న అధికారులు..

Posted On 2026-04-25 17:10:44

Readmore >
Image 1

కవిత "పాంచజన్యం" హామీలు

Posted On 2026-04-25 13:59:56

Readmore >
Image 1

కేసీఆర్ పై కవిత సంచలన వ్యాఖ్యలు

Posted On 2026-04-25 11:37:20

Readmore >
Image 1

తెలంగాణ రాష్ట్ర సేన ( టిఆర్ఎస్ )

Posted On 2026-04-25 11:28:47

Readmore >
Image 1

కలెక్టరేట్ లో కీచకుడు

Posted On 2026-04-25 10:11:42

Readmore >