Posted on 2024-10-18 20:00:10
ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా షాద్‌నగర్ కు చెందిన గందె సురేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా ఆర్య వైశ్య సంఘం ఎన్నికలు రాష్ట్ర అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో జరిగాయి. ఈ నేపథ్యంలో షాద్ నగర్ నుండి పలువురు జిల్లా అధ్యక్ష పదవికి పోటీ చేశారు. ఆర్యవైశ్య సంఘం సీనియర్ నాయకులు, జర్నలిస్ట్ సరాపు రమేష్ కుమార్, అగీరు రవికుమార్ గుప్త, గందె సురేష్, రిటైర్డ్ తహసిల్దార్ సరావు జగదీశ్వర్, తదితరులు నామినేషన్ వేశారు. అయితే ఆర్యవైశ్య సంఘం రాష్ట్ర కార్యవర్గం తదితర పెద్దలు కొంతమంది నామినేషన్లను స్వచ్చందంగా ఉపసంహరించుకునేలా చేశారు. ఎన్నికను ఏకగ్రీవం చేసి గందె సురేష్ ను అధ్యక్షుడిగా ప్రకటించారు. గతంలో షాద్‌నగర్ వాసవి క్లబ్ చార్టర్ ప్రసిడెంట్, ప్రస్తుతం ఆర్యవైశ్య సంఘం జిల్లా కార్యదర్శిగా గందె సురేష్ కొనసాగుతున్నారు
పెట్రోల్, డీజిల్ నిల్వలపై ఆందోళన వద్దు : కలెక్టర్ కృతిక శుక్ల
Posted On 2026-04-25 22:28:14
Readmore >
కానిస్టేబుల్ భార్య, అతడి కుమారుడ్ని కత్తితో పొడిచి చంపిన ప్రియురాలు
Posted On 2026-04-25 21:27:36
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : బాల్య వివాహం... అడ్డుకున్న అధికారులు..
Posted On 2026-04-25 17:10:44
Readmore >