Posted on 2024-10-17 13:35:12
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: ఆదికవి శ్రీ వాల్మీకి మహర్షి జీవిత చరిత్రను మనమందరం ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ అన్నారు. గురువారం రోజున జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వాల్మీకి చిత్రపటానికి పూలమాలవేసి నివాళ్ళు అర్పించారు
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ...
ఒక సామాన్య వ్యక్తిగా పుట్టి బోయవాణిగా జీవితం గడిపి సప్తబుషుల బోధనలను ద్వారా మహర్షి వాల్మీకి మారి అధ్బుతమైన రామాయణం గ్రంథాన్ని మనకు అందించిన మహనీయుడు వాల్మీకీ గారిని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకొని ఆదర్శవంతులుగా జీవించి మంచి పేరు తెచ్చుకోవాలని పేర్కొన్నారు.కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు మహా పురుషులవుతారు అనేదానికి వాల్మీకి మహర్షి జీవిత చరిత్ర నిలువెత్తు నిదర్శనం అని అన్నారు.
ఈ కార్యాలయంలో జిల్లా పోలీస్ కార్యాలయ అడ్మినిస్ట్రేషన్ అధికారి, సూపరింటెండెంట్ లు,సిబ్బంది పాల్గొన్నారు.
వీర్లపల్లిలో పచ్చని మారణకాండ: ఎమ్మెల్యే నోట "పిచ్చి మొక్కల" మాట!
Posted On 2026-04-26 07:56:12
Readmore >
పెట్రోల్, డీజిల్ నిల్వలపై ఆందోళన వద్దు : కలెక్టర్ కృతిక శుక్ల
Posted On 2026-04-25 22:28:14
Readmore >
కానిస్టేబుల్ భార్య, అతడి కుమారుడ్ని కత్తితో పొడిచి చంపిన ప్రియురాలు
Posted On 2026-04-25 21:27:36
Readmore >