| Daily భారత్
Logo




రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా ఎలుగంటి మధుసూదన్ రెడ్డి బాధ్యతల స్వీకరణ

News

Posted on 2024-10-16 21:01:11

Share: Share


రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా ఎలుగంటి మధుసూదన్ రెడ్డి బాధ్యతల స్వీకరణ

డైలీ భారత్ రంగారెడ్డి జిల్లా:రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా ఎలుగంటి మధుసూదన్ రెడ్డి బుదవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. జిల్లా గ్రంథాలయంలోని తన చాంబర్‌లో నియామక పత్రంపై, హాజరు పట్టీలో సంతకం చేశారు. ఈ సందర్భంగా చైర్మన్‌ మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ తనను ఈ పదవిలో నియమించిన సీఎం రేవంత్‌రెడ్డికి, సహకరించిన మంత్రులు, ఎమ్మెల్యేలుకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. జిల్లాలో గ్రంథాలయాల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. గ్రంథాలయ సంస్థపై ఇప్పటికీ అవగాహన లేదని, త్వరలో అధికారులు, సిబ్బందితో కలిసి అన్ని వివరాలు తెలుసుకుంటానని తెలిపారు. ఆగిపోయిన నూతన భవన నిర్మాణం, డిజిటల్‌ లైబ్రరీపై దృష్టిసారిస్తానన్నారు. మండల కేంద్రాల్లోని గ్రంథాలయాలపై ఫోకస్‌ పెడతానని పేర్కొన్నారు.రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యేలు కాలే యాదయ్య, వీర్లపల్లి శంకర్,ప్రకాష్ గౌడ్,రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్‌ పార్టీ నాయకులు తదితరులు చైర్మన్ మధుసూదన్ రెడ్డికి పుష్పగుచ్ఛాలు, శాలువాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

Image 1

ఎస్సై చైతన్య చందర్ పై వేటు

Posted On 2026-04-26 12:36:35

Readmore >
Image 1

“ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి – నివారణే ఉత్తమ వైద్యం”

Posted On 2026-04-26 11:49:35

Readmore >
Image 1

కలెక్టరేట్ లో ఘనంగా వాసవి మాత జయంతి వేడుకలు

Posted On 2026-04-26 11:43:59

Readmore >
Image 1

వీర్లపల్లిలో పచ్చని మారణకాండ: ఎమ్మెల్యే నోట "పిచ్చి మొక్కల" మాట!

Posted On 2026-04-26 07:56:12

Readmore >
Image 1

హెచ్ పీ వీ వ్యాక్సిన్ లక్ష్యం పూర్తి చేయాలి

Posted On 2026-04-26 07:51:25

Readmore >
Image 1

రాజన్న ఆలయ గోశాలకు వరిగడ్డి వితరణ

Posted On 2026-04-25 22:35:25

Readmore >
Image 1

పెట్రోల్, డీజిల్ నిల్వలపై ఆందోళన వద్దు : కలెక్టర్ కృతిక శుక్ల

Posted On 2026-04-25 22:28:14

Readmore >
Image 1

కానిస్టేబుల్‌ భార్య, అతడి కుమారుడ్ని కత్తితో పొడిచి చంపిన ప్రియురాలు

Posted On 2026-04-25 21:27:36

Readmore >
Image 1

ఆర్థిక మోసం కేసులో మంగ్లీ పాత్రపై దర్యాప్తు ముమ్మరం

Posted On 2026-04-25 20:38:22

Readmore >
Image 1

మంజుల కలం – ఆకలిపై అక్షర యజ్ఞం

Posted On 2026-04-25 19:28:22

Readmore >