| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

మంత్రాల నెపంతో.. మహిళపై పెట్రోల్‌ పోసి సజీవదహనం చేశారు

మంత్రాల నెపంతో.. మహిళపై పెట్రోల్‌ పోసి సజీవదహనం చేశారు

డైలీ భారత్, రామాయంపేట: మెదక్‌ జిల్లాలోని  రామాయంపేటలో దారుణం చోటుచేసుకున్నది. మండలంలోని కాట్రియాలలో మంత్రాల నెపంతో ఓ మహిళను సజీవదహనం చేశారు. గురువారం రాత్రి ద్యాగాల ముత్తవ్వ అనే మహిళ తన ఇంట్లో ఉండగా గ్రామస్థులు ఆమెపై దాడి చేశారు. మంత్రాలు చేస్తున్నదని పెట్రోల్‌ పోసి నిప్పంటించారు. అరుపులు విన్న స్థానికులు ఆమెను రక్షించేందుకు ప్రయత్నం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. బాధితురాలిని దవాఖానకు తరలించారు.

అయితే మెరుగైన చికిత్స నిమిత్తం ఆమెను హైదరాబాద్‌లోని హాస్పిటల్‌కు తరలిస్తుండగా మృతిచెందింది. దీంతో మృతదేహాన్ని పోలీసులు రామాయంపేట దవాఖానకు తీసుకెళ్లారు. దాడి భయంతో మృతురాలి కుమారుడు, కోడలు పారిపోయారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు.. ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.


#రామాయంపేట  #medak

Previous చార్మినార్ దగ్గర బతుకమ్మ సంబరాలు.. అనుమతించిన హైకోర్టు
Next కాంగ్రెస్ పార్టీ తోనే గిరిజనుల అభివృద్ధి : ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
ADVERTISEMENT