Posted on 2024-09-30 11:18:26
క్రిస్టన్ మైనార్టీ ఆధ్వర్యంలో బైబిల్ విజ్ఞాన యాత్ర
జెండా ఊపి ప్రారంభించిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: మనవాలి జీవితం సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆధ్యాత్మికతతో మానవులు జీవించాలని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. ఆసియాలో పెద్ద చర్చిలలో ఒకటైన క్రీస్తు జ్యోతి ప్రార్థన మందిరం కర్ణపుర్ చర్చికి నియోజకవర్గ పరిధిలోని చర్చుల ఫాదర్లు, వారి కుటుంబ సభ్యులతో బైబిల్ విజ్ఞాన యాత్రకు బయలుదేరి వెళ్తున్న సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ జెండా ఊపి విజ్ఞాన యాత్ర కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ మానవాళి జీవితం ఎల్లవేళలా సుఖశాంతులతో, దైవ చింతనతో జీవనం సాగించాలని కోరారు. వరంగల్, మెదక్ జిల్లాల్లో ఆన్న ప్రముఖ చేర్చిలను సందర్శించనున్నట్లు చర్చ్ ఫాదర్ జోసఫ్ తెలిపారు. స్వామి దాస్ ఆధ్వర్యంలో సుమారు 100 మంది ఈ యాత్రకు వెళ్తున్నారు. యాత్రకు వెళ్తున్న వారిలో చించొడు గ్రామ చర్చి పాస్టర్ దేవయ్య , కొందుర్గు మండలం పాస్టర్ రవి కుమార్ , కేశంపేట్ మండలం కృష్ణయ్య పాస్టర్, కొత్తూరు మండలం ఈశ్వర్య పాస్టర్ , నందిగామ మండలం పీటర్ ఫాదర్, చౌదరి గూడెం మండలంలోని మాణిక్యం ఫాస్టర్ , చిన్న రవి తేజ,అనంతం తదితరులు ఉన్నారు..
ప్రతి ఇంటి సమాచారం నమోదు… మన అందరి ప్రథమ కర్తవ్యం... జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా
Posted On 2026-04-24 22:25:39
Readmore >
బూర్గంపాడు మండలం : పేకాట స్థావరాలపై సిసిఎస్ పోలీసులు మెరుపు దాడి
Posted On 2026-04-24 22:18:33
Readmore >
ద్విచక్ర వాహనం చోరి నిందితులను చాకచక్యంగా పట్టుకున్న జూలూరుపాడు ఎస్ఐ బాదావత్ రవి, సిబ్బంది
Posted On 2026-04-24 19:11:00
Readmore >