| Daily భారత్
Logo




గ్రీన్ టాక్స్, ఫిట్ నెస్ చలనాలు పెద్ద మొత్తంలో వసూలు

News

Posted on 2024-09-29 23:12:39

Share: Share


గ్రీన్ టాక్స్, ఫిట్ నెస్ చలనాలు పెద్ద మొత్తంలో వసూలు

లారీ ఓనర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సయ్యద్ సాదిక్

రవాణా రంగం కుదేలైంది

డీజిల్ ధరలు తగ్గక అవస్థలు

చాలా కాలంగా పెండింగ్లో  సింగిల్ పర్మిట్ విధానం అమలు లేదు

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా : గత రెండు నెలలుగా తెలంగాణ రాష్ట్రంలో వర్షాలతో రవాణా రంగం కుదేలైందని, దీనికి తోడు రవాణా రంగాన్ని అనేక సమస్యలు కుదిపివేస్తున్నాయని తెలంగాణ లారీ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు, రంగారెడ్డి జిల్లా  స్టార్ ట్రాన్స్పోర్ట్ కంపెనీ నిర్వాహకుడు సయ్యద్ సాదిక్ ఆందోళన వ్యక్తం చేశారు. రవాణా రంగం సమస్యలను పరిష్కరించుకునేందుకు లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొత్తపల్లిలో అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. దీనికోసం లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు అంజిరెడ్డి, ప్రధాన కార్యదర్శి దుర్గాప్రసాద్, ఉపాధ్యక్షులు సయ్యద్ సాదిక్, అసోసియేషన్ నేతలు నవాజ్ గోరి, మొహమ్మద్ ఫయాజ్, మహమ్మద్ షబీర్ తదితరులు హాజరయ్యారు. 

ఈ సందర్భంగా రవాణా రంగానికి సంబంధించిన పలు సమస్యలను సయ్యద్ సాదిక్  మీడియాకు వివరించారు. గత రెండు నెలలుగా తీవ్ర వర్షా ప్రభావంతో రవాణా రంగం కిరాయిలు లేక అష్ట కష్టాల పాలు అయిందని అన్నారు. దీనికి తోడు లారీలపై విధిస్తున్న పలు రకాల పన్నులు వెంటనే మాఫీ చేయాలని ఏకగ్రీవంగా తీర్మానం చేసినట్టు తెలిపారు. డీజిల్ ధర తగ్గింపు పేరిట అనేక సందర్భాల్లో ధరలు పెంచి రవాణా రంగాన్ని పూర్తిగా కుదేలు చేస్తున్నారని వెంటనే డీజిల్ ధరలు తగ్గించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తీర్మానించారు. అదేవిధంగా చాలా కాలంగా పెండింగ్లో ఉన్న సింగిల్ పర్మిట్ విధానాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సమావేశంలో తీర్మానం చేసినట్టు తెలిపారు. గత 15 సంవత్సరాలుగా ఫిట్నెస్, గ్రీన్ టాక్స్ ప్రభుత్వం పెద్ద మొత్తంలో వసూలు చేస్తుందని అలాంటి చలనాలు పూర్తిగా తగ్గించాలని తీర్మానించినట్టు తెలిపారు. ప్రకృతి వైపరీత్యాలకు నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఎలా ఆదుకుంటుందో ఈ వర్షాలకు వరదలకు దెబ్బతిన్న లారీలను వెంటనే ప్రభుత్వమే రిపేరు చేయించే విధంగా చూడాలని అన్నారు. ప్రభుత్వం రైతుల నుండి కొనుగోలు చేస్తున్న ధాన్యం విషయంలో స్థానిక లారీలకే న్యాయం చేయాలని తీర్మానించారు. పాత వాహనాలు రద్దు గురించి కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త జీవో పట్ల రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేయాలని ఎందుకంటే ఈ అంశం సుప్రీంకోర్టులో ఉందని తెలియజేశారు. దీనిపై ప్రభుత్వం ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని సమావేశంలో తీర్మానం చేసినట్టు సయ్యద్ సాదిక్ తెలిపారు..

Image 1

ప్రతి ఇంటి సమాచారం నమోదు… మన అందరి ప్రథమ కర్తవ్యం... జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా

Posted On 2026-04-24 22:25:39

Readmore >
Image 1

హిందూ బంధువులారా కదలిరండి ...

Posted On 2026-04-24 22:20:16

Readmore >
Image 1

బూర్గంపాడు మండలం : పేకాట స్థావరాలపై సిసిఎస్ పోలీసులు మెరుపు దాడి

Posted On 2026-04-24 22:18:33

Readmore >
Image 1

ద్విచక్ర వాహనం చోరి నిందితులను చాకచక్యంగా పట్టుకున్న జూలూరుపాడు ఎస్ఐ బాదావత్ రవి, సిబ్బంది

Posted On 2026-04-24 19:11:00

Readmore >
Image 1

వేములవాడ రాజన్న ఆలయంలో డీజీపీ ప్రత్యేక పూజలు

Posted On 2026-04-24 17:56:12

Readmore >
Image 1

ఆన్‌లైన్ రమ్మీ వ్యసనం… ఐదుగురి ప్రాణాలు బలి!

Posted On 2026-04-24 17:22:03

Readmore >
Image 1

నివారణ కలిగిన వ్యాధి మలేరియా

Posted On 2026-04-24 17:20:12

Readmore >
Image 1

బీజేపీ లోకి రాఘవ్ చద్దా

Posted On 2026-04-24 16:36:30

Readmore >
Image 1

మదనపల్లెలో టమాట ధర రూ.38కు చేరిక...

Posted On 2026-04-24 12:08:57

Readmore >
Image 1

పరువు హత్య.. చెల్లెలి చెలికాడిని కొట్టి చంపిన అన్నలు...

Posted On 2026-04-24 12:08:02

Readmore >