Posted on 2024-09-21 17:04:02
శాంతి ఐక్యమత్యమే మహాబలం..!
ర్యాలీకి హాజరైన శంషాబాద్ ఎసిపి శ్రీనివాస్ రావు, కొత్తూర్ పోలీసు అధికారులు
ర్యాలీకి సంఘీభావం ప్రకటించిన మాజీ జెడ్పిటిసి శ్యాంసుందర్ రెడ్డి
షాద్ నగర్ నుండి కాంగ్రెస్ మైనార్టీ నేతలు మహమ్మద్ అలీ ఖాన్ బాబర్, మహమ్మద్ ఇబ్రహీం, గిరిజన కోఆర్డినేటర్ రఘు, హరినాథ్ రెడ్డి, ఇషాక్,హాజరు
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా :శాంతి, సౌభ్రాతృత్వం, ఐక్యమత్యమే మహాబలమని ప్రతి ఒక్కరు మొహమ్మద్ ప్రవక్త (సల్లెల్లాహు అలైహి వసల్లెం) బోధించిన సన్మార్గంలో నడవాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. శనివారం కొత్తూరు మండలం ఇన్ముల్ నర్వ గ్రామంలో ఏక్ మినార్ మజీద్ నుండి హజరత్ జహంగీర్ పీర్ దర్గా వరకు కడప పీర్ భాయ్ ల ఆధ్వర్యంలో స్థానిక మైనార్టీ యువత భారీ ర్యాలీ ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శంషాబాద్ ఏసిపి శ్రీనివాసరావు తదితర పోలీసు అధికారులు హాజరుకాగా, కొత్తూరు మండల మాజీ జెడ్పిటిసి కాంగ్రెస్ సీనియర్ నేత మామిడి శ్యాంసుందర్ రెడ్డి, కాంగ్రెస్ పిసిసి సభ్యులు మొహమ్మద్ అలీ ఖాన్ బాబర్, మహమ్మద్ ఇబ్రహీం, గిరిజన ఆదివాసి రాష్ట్ర కోఆర్డినేటర్ పి. రఘునాయక్, సీనియర్ నేత హరినాథ్ రెడ్డి,కాంగ్రెస్ నాయకులు మొహమ్మద్ ఇషాక్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ జెడ్పిటిసి శ్యాంసుందర్ రెడ్డి మిలాద్ నబీ ర్యాలీ ప్రదర్శనకు సంబంధించిన ప్రత్యేక ప్రార్థనలను చేసి బాబాకు దట్టీలు సమర్పించారు. అనంతరం స్థానిక నాయకులు ముఖ్య అతిథులు ప్రజలకు అన్నదానం చేశారు. ఇనుముల్ నర్వ గ్రామం నుండి అంగరంగ వైభవంగా భారీ ఎత్తున వందలాదిమంది మైనార్టీ యువత వాహనాలపై ర్యాలీ ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమానికి గుర్రాలపై పచ్చజెండాలను ఊపుతూ యువత ప్రత్యేకంగా ఆకట్టుకుంది. కడప పీర్ భాయ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎసిపి శ్రీనివాసరావు ప్రతి ఒక్కరు ఐకమత్యంగా శాంతి సౌభ్రాతృత్వంతో జీవించాలని కోరారు. మాజీ జెడ్పిటిసి శ్యాంసుందర్ రెడ్డి మాట్లాడుతూ.. మైనార్టీ యువత ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం చేపట్టడం అభినందనీయమని మహమ్మద్ ప్రవక్త పై ముస్లింలకు ఉన్న ప్రేమ అభిమానాలు గౌరవం ప్రదర్శించారని తెలిపారు. పిసిసి నేత మహమ్మద్ అలీ ఖాన్ బాబర్ మాట్లాడుతూ.. మహమ్మద్ ప్రవక్త సూచించిన సన్మార్గంలో ప్రతి యువకుడు నడవాలని ఇంత గొప్ప కార్యక్రమం చేసినందుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా మొహమ్మద్ ఇబ్రహీం మాట్లాడుతూ.. యువతకు తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని చెప్పారు. గిరిజన రాష్ట్ర కోఆర్డినేటర్ పి రఘునాయక్ మాట్లాడుతూ సమాజంలో శాంతి సామరస్యం వెల్లివిరిసేందుకు ముస్లిం యువత ఇంత పెద్ద ఎత్తున ప్రదర్శన నిర్వహించడం వల్ల సమాజంలో మంచి సంకేతాలు వెళ్తాయని ఆశించారు. స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సహకారంతో జహంగీర్ పీర్ దర్గా అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. ఇక్కడి మైనార్టీ యువతకు ఉపాధి ఇతర మౌలిక సదుపాయాల దృశ్య ఎమ్మెల్యే శంకర్ సహకారం అండ ఎల్లవేళలా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సోదరులు పాల్గొన్నారు..
సింగరేణిలో గుర్తింపు సంఘాల గడువు ముగిసింది... అన్ని యూనియన్లకు సమాన హోదా ఇవ్వాలి
Posted On 2026-09-12 14:34:53
Readmore >
గణేష్ మండపాలకు పోలీస్ ఆన్‌లైన్ అనుమతి తప్పనిసరి... జూలూరుపాడు SI జీనత్ కుమార్
Posted On 2026-09-12 06:24:45
Readmore >
పాఠశాలల్లో పనిచేస్తున్న స్వీపర్ కం స్కావెంజర్ వేతనాలను నేరుగా బ్యాంక్ అకౌంట్లో జమ చేయాలి
Posted On 2026-09-11 17:11:43
Readmore >
అధిక జ్వరం, టాన్సిల్స్ సమస్యతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మద్దిశెట్టి సామెల్
Posted On 2026-09-11 17:09:19
Readmore >
భీక్‌నూర్ 132/33 కేవీ సబ్ స్టేషన్‌లో లోడ్ పరిస్థితిని పరిశీలించిన ఆపరేషన్-1 సీఈ అశోక్
Posted On 2026-09-11 15:57:20
Readmore >
తెలంగాణ విమోచన దినోత్సవం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి
Posted On 2026-09-11 14:51:47
Readmore >
ప్రతీ కులానికి యూనిక్ కోడ్ కేటాయించాలి... బిసి ల ధర్మ పోరాట దీక్ష
Posted On 2026-09-11 14:50:44
Readmore >
పీఓపీకి స్వస్తి... మట్టి వినాయకుడికే జై... కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపు
Posted On 2026-09-11 09:53:32
Readmore >