| Daily భారత్
Logo




తోగూడెం లో 1/70 కి తూట్లు : సేవాలాల్ సేన

News

Posted on 2024-09-21 04:16:30

Share: Share


తోగూడెం లో 1/70 కి తూట్లు : సేవాలాల్ సేన

క్వారీ వ్యవస్థతో కోట్ల వ్యాపారం 

తారు ప్లాంట్ల ఏర్పాటుతో మరో దోపిడీ

డైలీ భారత్, పాల్వంచ: పాల్వంచ మండల పరిధి తోగూడెం ఏజెన్సీ ప్రాంతంలో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న క్వారీ వ్యవస్థ ప్రజల ప్రాణాలకు ముప్పుగా వాటిల్లిందని సేవాలాల్ సేన అభ్యంతరం వ్యక్తం చేసింది. శుక్రవారం పట్టణ పరిధి కేటీపీఎస్  తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల సంక్షేమ భవన్లో సేవాలాల్ సేన ముఖ్య కార్యకర్తల సమావేశం మండల అధ్యక్షుడు పరమేష్ నాయక్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా సేవాలాల్ సేన, యువసేన జిల్లా అధ్యక్షులు మా లోతు శివ నాయక్, బానోత్  భరత్ నాయక్ లు మాట్లాడుతూ.. ఏజెన్సీలో గిరిజనేతర పెత్తనం ఇటీవల కాలంలో తీవ్రతర మైందన్నారు. గిరిజనుల పేరుతో గిరిజనేతర బడా బాబులు అడ్డుకోలు దోపిడీకి పాల్పడటం రాజ్యాంగ విరుద్ధమన్నారు. తోగ్గుడెం ఏజెన్సీలో 1/70 రూల్స్ కి వ్యతిరేకంగా గిరిజనేతర వర్గాలు కోట్ల వ్యాపారం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా  బాంబులు పేల్చి, కంకర ను సేకరించడం వెనుకున్న అధికార వర్గాల నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. ఒకడుగు ముందు కేసిన క్వారీ యాజమాన్యాలు తోగూడెం లోనే తారు ప్లాంట్లు ఏర్పాటు చేసి విచ్చలవిడి వ్యాపారానికి తెర లేపారని మండి పడ్డారు. బాంబు బ్లాస్టింగ్, తారు ప్లాంట్ల ఏర్పాటుతో పలు గృహాలు విధ్వంసానికి గురవడంతోపాటు ఆదివాసి ప్రజలు దీర్ఘకాలిక వ్యాధులతో సతమతమవుతున్నట్లు పేర్కొన్నారు. పర్మిషన్ లేని ప్లాంట్లను తక్షణం సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. పర్మిషన్ ఇచ్చిన అధికారులను తక్షణం విధులోంచి తొలగించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. లేని పక్షంలో కలెక్టరేట్ ముట్టడి చేపడతామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో సేవాలాల్ మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు రుక్మిణి బాయ్, జిల్లా, మండల భాద్యులు పాల్గొన్నారు.

Image 1

సింగరేణిలో గుర్తింపు సంఘాల గడువు ముగిసింది... అన్ని యూనియన్లకు సమాన హోదా ఇవ్వాలి

Posted On 2026-09-12 14:34:53

Readmore >
Image 1

గణేష్ మండపాలకు పోలీస్ ఆన్‌లైన్ అనుమతి తప్పనిసరి... జూలూరుపాడు SI జీనత్ కుమార్

Posted On 2026-09-12 06:24:45

Readmore >
Image 1

AIYF రాష్ట్ర సమితి సభ్యుడిగా ఎస్కే చాంద్ పాషా ఎన్నిక

Posted On 2026-09-11 17:13:23

Readmore >
Image 1

పాఠశాలల్లో పనిచేస్తున్న స్వీపర్ కం స్కావెంజర్ వేతనాలను నేరుగా బ్యాంక్ అకౌంట్లో జమ చేయాలి

Posted On 2026-09-11 17:11:43

Readmore >
Image 1

అధిక జ్వరం, టాన్సిల్స్ సమస్యతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మద్దిశెట్టి సామెల్

Posted On 2026-09-11 17:09:19

Readmore >
Image 1

జనగణనలో బీసీ కాలమ్ కోసం ధర్మ పోరాట దీక్ష

Posted On 2026-09-11 17:08:05

Readmore >
Image 1

భీక్‌నూర్ 132/33 కేవీ సబ్ స్టేషన్‌లో లోడ్ పరిస్థితిని పరిశీలించిన ఆపరేషన్-1 సీఈ అశోక్

Posted On 2026-09-11 15:57:20

Readmore >
Image 1

తెలంగాణ విమోచన దినోత్సవం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి

Posted On 2026-09-11 14:51:47

Readmore >
Image 1

ప్రతీ కులానికి యూనిక్ కోడ్ కేటాయించాలి... బిసి ల ధర్మ పోరాట దీక్ష

Posted On 2026-09-11 14:50:44

Readmore >
Image 1

పీఓపీకి స్వస్తి... మట్టి వినాయకుడికే జై... కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపు

Posted On 2026-09-11 09:53:32

Readmore >