Posted on 2024-09-20 18:42:17
డైలీ భారత్, కర్ణాటక డెస్క్: కర్ణాటకలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. మైసూరు రోడ్డులోని కంబీపూర్‌లోని ఏసీఎస్ కాలేజీలో ఈ దారుణం చోటుచేసుకుంది.
కాలేజీ బాత్రూమ్ లో సీక్రెట్ కెమెరాలను కొంత మంది అమ్మాయిలు గమనించారు. దీనిపై వెంటనే కాలేజీ యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. దీంతో పెద్ద ఎత్తున నినాదాలు చేస్తు, అమ్మాయిలు నిరసనలు చేపట్టారు.
ఇదిలా ఉండగా.. పోలీసులు రంగంలోకి దిగారు. అక్కడ ఉన్న హిడెన్ కెమెరాను స్వాధీనం చేసుకున్నారు. దీనిలో కుశాల్ అనే ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థి కారణమని కూడా బైటపడింది. అతని ఫోన్ లు, ల్యాప్ టాప్ లను పరిశీలించగా.. వేల కొలది న్యూడ్ వీడియోలు ఉన్నట్లు కూడా ప్రచారం జరుగుతుంది. ఈ ఘటన కన్నడ నాట పెనుదుమారంగా మారింది. దీంతో కాలేజీలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
వెంటనే పోలీసులు రంగంలోకి దిగి కుశాల్ ను అదుపులోకి తీసుకున్నారు. దీనిపై పెద్ద ఎత్తున విద్యార్థి సంఘాలు వచ్చి కాలేజీ వద్ద నిరసనలకు దిగాయి. కాలేజీ యాజమాన్యం వద్దకు అమ్మాయిల తల్లిదండ్రులు చేరుకుని ఘటనపై మండిపడుతున్నారు. ప్రస్తుతం పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే.. ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ లో గుడ్లవల్లేరు కాలేజీలో కూడా వాష్ రూమ్ లో.. యువతుల బాత్రూమ్ లో ఇలాంటి హిడెట్ కెమెరా ఘటన తీవ్ర వివాదంగా మారిన విషయం తెలిసిందే. అక్కడ కూడా.. ఒక యువతి తన లవర్ కోసం.. అమ్మాయిల బాత్రూమ్ లో.. సీక్రెట్ కెమెరాలను పెట్టినట్లు ప్రచారం జరిగింది. దీనిపైన ఏపీ సీఎం చంద్రబాబు ఘటనను సీరియస్ గా తీసుకున్నారు. అంతేకాకుండా.. విద్యార్థినులకు న్యాయం చేయాలని కూడా పలు సంఘాలు, కాలేజీకి చేరుకుని తమ నిరసలను సైతం తెలిపాయి.
సింగరేణిలో గుర్తింపు సంఘాల గడువు ముగిసింది... అన్ని యూనియన్లకు సమాన హోదా ఇవ్వాలి
Posted On 2026-09-12 14:34:53
Readmore >
గణేష్ మండపాలకు పోలీస్ ఆన్‌లైన్ అనుమతి తప్పనిసరి... జూలూరుపాడు SI జీనత్ కుమార్
Posted On 2026-09-12 06:24:45
Readmore >
పాఠశాలల్లో పనిచేస్తున్న స్వీపర్ కం స్కావెంజర్ వేతనాలను నేరుగా బ్యాంక్ అకౌంట్లో జమ చేయాలి
Posted On 2026-09-11 17:11:43
Readmore >
అధిక జ్వరం, టాన్సిల్స్ సమస్యతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మద్దిశెట్టి సామెల్
Posted On 2026-09-11 17:09:19
Readmore >
భీక్‌నూర్ 132/33 కేవీ సబ్ స్టేషన్‌లో లోడ్ పరిస్థితిని పరిశీలించిన ఆపరేషన్-1 సీఈ అశోక్
Posted On 2026-09-11 15:57:20
Readmore >
తెలంగాణ విమోచన దినోత్సవం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి
Posted On 2026-09-11 14:51:47
Readmore >
ప్రతీ కులానికి యూనిక్ కోడ్ కేటాయించాలి... బిసి ల ధర్మ పోరాట దీక్ష
Posted On 2026-09-11 14:50:44
Readmore >
పీఓపీకి స్వస్తి... మట్టి వినాయకుడికే జై... కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపు
Posted On 2026-09-11 09:53:32
Readmore >