Posted on 2024-09-18 15:26:22
వ్యక్తి ఆత్మహత్యకు కారణమైన నిందుతురాలికి ఏడాది జైలు శిక్ష విధిస్తూ సిరిసిల్ల అసిస్టెంట్ సెషన్స్ న్యాయమూర్తి రాధిక జైష్వాల్ తీర్పు వెల్లడించినట్లు సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల:ఇల్లంతకుంట మండలం జంగారెడ్డి పల్లెకు చెందిన వొల్లాల మల్లయ్య అనే వ్యక్తి వద్ద కరీంనగర్ కు చెందిన కిన్నెర మల్లవ్వ అనే మహిళ 2017 సంవత్సరంలో రూ.4,30,000 అప్పుగా తీసుకొని తిరిగి మల్లయ్య కూతురు పెళ్లికి అప్పు తిరిగి ఇస్తానని స్టాంప్ పేపర్ పైన రాసి ఇవ్వగా, 2018 సంవత్సరంలో మల్లయ్య తన కూతురి పెళ్లి ఖాయం కావడంతో మల్లవ్వను డబ్బులు అడుగగా , మల్లవ్వ డబ్బులు ఇవ్వకపోవడంతో పాటు బేధరింపులకు పాల్పడగా కూతురు పెళ్లి ఎక్కడ ఆగిపోతుందని తీవ్ర మనోవేదనకి గురైన మల్లయ్య తేదీ 19 ఆగస్టు 2018 రోజున పురుగుల మందు తాగి చనిపోయాడు. ఈ సంఘటనపై ఇళ్లంతకుంట పోలీసులు కేసు నమోదు చేసి మల్లవ్వని రిమాండ్ కు తరలించి, కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. ఈ కేసులో cms ఎస్ ఐ రవీంద్రనాయుడు ఆధ్వర్యంలో కోర్టు కానిస్టేబుల్ నవీన్, సిఎంఎస్ హెడ్ కానిస్టేబుల్ శంకర్ లు కోర్టులో 10 మంది సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ వేముల లక్ష్మీప్రసాద్ వాదించాగా కేసు పూర్వాపరాలను పరిశీలించిన న్యాయమూర్తి నేరం రుజువు కావడంతో నిందుతురాలు మల్లవ్వకి ఏడాది జైలు శిక్ష విధించినట్లు డిఎస్పీ తెలిపారు.
బెదిరింపులకు పాల్పడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న కరీంనగర్ కు చెందిన కిన్నెర మల్లవ్వ అనే మహిళకు శిక్ష పడటంలో కిలంకంగా వ్యవహరించిన pp వేముల లక్ష్మీప్రసాద్,కోర్టు కానిస్టేబుల్ నవీన్, సిఎంఎస్ హెడ్ కానిస్టేబుల్ శంకర్ లను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అభినందించారు.
పాఠశాలల్లో పనిచేస్తున్న స్వీపర్ కం స్కావెంజర్ వేతనాలను నేరుగా బ్యాంక్ అకౌంట్లో జమ చేయాలి
Posted On 2026-09-11 17:11:43
Readmore >
అధిక జ్వరం, టాన్సిల్స్ సమస్యతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మద్దిశెట్టి సామెల్
Posted On 2026-09-11 17:09:19
Readmore >
భీక్‌నూర్ 132/33 కేవీ సబ్ స్టేషన్‌లో లోడ్ పరిస్థితిని పరిశీలించిన ఆపరేషన్-1 సీఈ అశోక్
Posted On 2026-09-11 15:57:20
Readmore >
తెలంగాణ విమోచన దినోత్సవం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి
Posted On 2026-09-11 14:51:47
Readmore >
ప్రతీ కులానికి యూనిక్ కోడ్ కేటాయించాలి... బిసి ల ధర్మ పోరాట దీక్ష
Posted On 2026-09-11 14:50:44
Readmore >
పీఓపీకి స్వస్తి... మట్టి వినాయకుడికే జై... కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపు
Posted On 2026-09-11 09:53:32
Readmore >
చెందిప్పలో దొంగల బీభత్సం....అడ్డుకున్న వృద్ధురాలిపై కిరాతక దాడి
Posted On 2026-09-11 03:39:31
Readmore >
నిజాంసాగర్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
Posted On 2026-09-10 15:22:16
Readmore >