| Daily భారత్
Logo




రీల్స్ పిచ్చి కి కుటుంబం బలి

News

Posted on 2024-09-12 10:47:57

Share: Share


రీల్స్ పిచ్చి కి కుటుంబం బలి

డైలీ భారత్, ఉత్తరప్రదేశ్ డెస్క్: రీల్స్ పిచ్చి ఓ కుంటుంబాన్ని బలితీసుకుంది. సోషల్ మీడియాను అడ్డదారిలో వాడిన ఓ బాలుడు తాను దుర్మరణం చెందడంతోపాటు తల్లిదండ్రుల చావులకు ప్రత్యక్షంగా కారణమయ్యాడు.

ఏకంగా రైలు వస్తున్నపుడు పట్టాలపై నిలబడి వీడియో తీసి నెట్టింట సంచలనం క్రియేట్ చేయాలనే ప్రయత్నంలో అదే రైలు కిందపడి నలిగిపోయారు. ఇందుకు సంబంధించిన ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకోగా వివరాలు ఇలా ఉన్నాయి.

శుభకార్యానిక హాజరై..

యూపీలోని సీతాపూర్ జిల్లా లహర్‌పూర్‌కు చెందిన మహ్మద్ అహ్మద్ (26), నజ్రీన్ (24)లకు అబ్దుల్లా అనే మూడేళ్ల కొడుకు ఉన్నాడు. అయితే బుధవారం లఖింపూర్ ఖిరి జిల్లా హర్‌గావ్ దగ్గరలోని క్యోతి అనే గ్రామంలో ఓ శుభకార్యానికి కుటుంబంతో హాజరయ్యారు. ఈ క్రమంలోనే సమీపంలోని రైలు పట్టాలపైకి వచ్చి ఫొటోలు దిగడం మొదలుపెట్టారు. అప్పటికే ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్‌ చేయడం అలవాటున్న వారు.. రైల్వే ట్రాక్ పైకి వచ్చి రీల్స్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో రైలు వస్తున్న విషయాన్ని గమనించకపోవడంతో ఘోర ప్రమాదం జరిగింది. లక్నో నుంచి మైలాన్ వెళ్తున్న ప్యాసింజర్ రైలు ముగ్గురిని ఢీ కొట్టింది. దీంతో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. శరీరాలు ఛిద్రమయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరకుని విచారించారు. ఇన్‌స్టాగ్రామ్ వీడియోలు తీస్తుండగా ప్రమాదం జరిగినట్లు నిర్ధారించి, కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.

Image 1

వాటర్ బాటిలు అధిక ధర.. రూ.7 లక్షలు ఫైన్!

Posted On 2026-09-09 17:17:04

Readmore >
Image 1

కోదాడలో 10 ఇళ్ల దొంగతనం కేసులు ఛేదింపు... రూ.60 లక్షల బంగారంతో హైదరాబాద్ దొంగ అరెస్ట్

Posted On 2026-09-09 14:45:53

Readmore >
Image 1

స్పీకర్ కు బీఆర్ఎస్ బహిరంగ క్షమాపణ చెప్పాలి

Posted On 2026-09-09 14:29:32

Readmore >
Image 1

దేమేకలాన్ పాఠశాలలో ఘనంగా కలోజి నారాయణరావు జయంతి వేడుకలు

Posted On 2026-09-09 14:28:15

Readmore >
Image 1

జర్నలిస్టుల సంక్షేమానికి కృషి

Posted On 2026-09-09 08:35:55

Readmore >
Image 1

తెలుగు సాహిత్యానికి ప్రజాకవి కాళోజీ సేవలు చిరస్మరణీయం... ఎస్పీ మహేష్ బి.గితే

Posted On 2026-09-09 08:34:54

Readmore >
Image 1

నామకరణ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర డైరెక్టర్ ఆర్.టి.ఐ చట్టం... ఎంఎ సలీం

Posted On 2026-09-08 18:02:08

Readmore >
Image 1

వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో శ్రావణమాసం కుంకుమ పూజలు

Posted On 2026-09-08 18:01:01

Readmore >
Image 1

బాబు… అని పిలవాలని ఉన్నది…మంజుల పత్తిపాటి

Posted On 2026-09-08 08:44:38

Readmore >
Image 1

కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం

Posted On 2026-09-07 16:41:28

Readmore >