| Daily భారత్
Logo




భక్తులకు అసౌకర్యం కల్పించొద్దు....అధికారులకు షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆదేశం

News

Posted on 2024-09-11 10:28:02

Share: Share


భక్తులకు అసౌకర్యం కల్పించొద్దు....అధికారులకు షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆదేశం

బొబ్బిలిచెరుగులు సందర్శించిన ఎమ్మెల్యే శంకర్, తదితర పోలీసు అధికారులు

ప్రశాంతంగా నిమజ్జన కార్యక్రమాలు జరుపుకోవాలని పిలుపు

నిమజ్జన కార్యక్రమాల కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: వినాయక నవరాత్రుల సందర్భంగా నిమజ్జన కార్యక్రమం భక్తులు అంగరంగ వైభవంగా చేపడతారని వారికి ఎలాంటి ఆటంకాలు కల్పించొద్దని పోలీసు, మున్సిపల్, రెవెన్యూ, అగ్నిమాపక శాఖల అధికారులను ఆదేశించారు. బుధవారం ఫరూక్ నగర్ బొబ్బిలిచెరువును ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, స్థానిక ఏసిపి రంగస్వామి, సీఐ విజయ్ కుమార్, పట్టణ మున్సిపల్ కమిషనర్ చీమ వెంకన్న తదితర కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ.. భక్తులకు ఎలాంటి అసౌకర్యం అధికారులు కల్పించొద్దని హెచ్చరించారు. నిమజ్జనం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి ప్రమాదాలు సంభవించకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. బొబ్బిలి చెరువు వద్ద రహదారి పరిశీలనతో పాటు గజ ఈతగాళ్లు, ప్రమాదాల సమయంలో ఒక బోటు ఏర్పాటు చేయాలని అధికారులను ముందస్తుగా ఆదేశించారు. అవసరమైతే ప్రభుత్వ నిధులతో పాటు తాను కూడా సొంతంగా నిధులు సమకూర్చుతానని భక్తులకు ఎలాంటి ఆటంకాలు కల్పించకుండా పూర్తి భద్రత చర్యలు తీసుకోవాలని కోరారు. వినాయక మండపాల నుండి భక్తులు యువకులు పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వస్తారని చెరువు వద్ద వారికి ప్రత్యేకమైన భద్రత ఉండేవిధంగా చూడాలని అన్నారు.


ఈ సందర్భంగా చెరువు వద్ద అసౌకర్యంగా ఉన్న కొన్ని సిమెంటు పలకలను తాత్కాలికంగా తొలగించాలని ఆ తర్వాత మళ్లీ పెట్టుకోవచ్చని ఈ సందర్భంగా సూచించారు. నిమజ్జన కార్యక్రమాలు పూర్తయ్య వరకు అన్ని శాఖల అధికారులు బాధ్యతాయుతంగా ప్రవర్తించాలన్నారు. భక్తులు కూడా అన్ని శాఖల అధికారులకు పూర్తిస్థాయిలో సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు కే చెన్నయ్య, పిసిసి సభ్యులు మొహమ్మద్ అలీ ఖాన్ బాబర్, మాజీ మున్సిపల్ చైర్మన్ అగ్గనూరు విశ్వం, మాజీ ఎంపీపీ వన్నాడ ప్రకాష్ గౌడ్, కౌన్సిలర్ సర్వర్ పాష, సీనియర్ నేత అగ్గనూరు బస్వమప్ప, మండల పార్టీ అధ్యక్షుడు చల్ల శ్రీకాంత్ రెడ్డి, మాజీ ఎంపిటిసి భార్గవ కుమార్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గండ్రాతి బాలరాజు గౌడ్, మాజీ కౌన్సిలర్ విజయకుమార్ రెడ్డి, కౌన్సిలర్ రాయికల్ శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ రాజేందర్ రెడ్డి, ముబారక్ అలీ ఖాన్, సయ్యద్ ఖదీర్, లింగారెడ్డి గూడా అశోక్,జగదీశ్వర్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు..

Image 1

కోదాడలో 10 ఇళ్ల దొంగతనం కేసులు ఛేదింపు... రూ.60 లక్షల బంగారంతో హైదరాబాద్ దొంగ అరెస్ట్

Posted On 2026-09-09 14:45:53

Readmore >
Image 1

స్పీకర్ కు బీఆర్ఎస్ బహిరంగ క్షమాపణ చెప్పాలి

Posted On 2026-09-09 14:29:32

Readmore >
Image 1

దేమేకలాన్ పాఠశాలలో ఘనంగా కలోజి నారాయణరావు జయంతి వేడుకలు

Posted On 2026-09-09 14:28:15

Readmore >
Image 1

జర్నలిస్టుల సంక్షేమానికి కృషి

Posted On 2026-09-09 08:35:55

Readmore >
Image 1

తెలుగు సాహిత్యానికి ప్రజాకవి కాళోజీ సేవలు చిరస్మరణీయం... ఎస్పీ మహేష్ బి.గితే

Posted On 2026-09-09 08:34:54

Readmore >
Image 1

నామకరణ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర డైరెక్టర్ ఆర్.టి.ఐ చట్టం... ఎంఎ సలీం

Posted On 2026-09-08 18:02:08

Readmore >
Image 1

వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో శ్రావణమాసం కుంకుమ పూజలు

Posted On 2026-09-08 18:01:01

Readmore >
Image 1

బాబు… అని పిలవాలని ఉన్నది…మంజుల పత్తిపాటి

Posted On 2026-09-08 08:44:38

Readmore >
Image 1

కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం

Posted On 2026-09-07 16:41:28

Readmore >
Image 1

నకిలీ హిజ్రా మాఫియాపై పోలీసుల ఉక్కుపాదం

Posted On 2026-09-07 04:33:05

Readmore >