Posted on 2023-11-09 06:25:49
డైలీ భారత్, సిరిసిల్ల: సిరిసిల్ల మున్సిపల్ వారు నిర్వహిస్తున్న నెహ్రు నగర్ స్మశాన వాటికకు నాలుగు రోజుల నుండి సెస్ అధికారులు కరెంటు తీసివేసినారు. దహన సంస్కారాలకు 7,500 రూపాయలు చెల్లిస్తున్న కూడా కరెంటు బిల్లు మున్సిపల్ అధికారులు చెల్లించకపోవడం ఏమిటి అని సిరిసిల్ల పౌర సంక్షేమ సమితి అధ్యక్షుడు బియ్యంకార్ శ్రీనివాస్ ప్రశ్నిస్తున్నాడు. ముఖ్యంగా ఎంతో బాకీలు ఉన్న వారిని అధికారులు వదిలేసి ఈ స్మశాన వాటిక విద్యుత్ తొలగించడం ఏమిటి రాత్రి వేళలో మహిళలు పిల్లలు సంప్రదాయ ప్రకారంగా దహన సంస్కారాలు స్నానం చేసేందుకు కూడా అవకాశం లేదు. నిర్వహించే సంప్రదాయలు నిర్వహించలేకపోతున్నారు. చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కరెంటు సరఫరా చేయకపోవడం బాధాకరమైన విషయం ముఖ్యంగా ఇది ఎన్నికల సమయం మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం అని తెలిసినా కూడా సెస్ మునిసిపల్అధికారులు, చైర్ పర్సన్ ఇలా ఎందుకు వ్యవహరిస్తున్నారు అర్థం కావడం లేదు వెంటనే నెహ్రూ నగర్ స్మశాన వాటికను పునరుద్దీకరించాలని కోరుతున్నాను.
ఈ కార్యక్రమంలో సిరిసిల్ల పౌర సంక్షేమ సమితి అధ్యక్షులు బియ్యంకార్ శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు మల్లాజి, ప్రధాన కార్యదర్శి వేముల సత్యనారాయణ, సహాయ కార్యదర్శి కుసుమ గణేష్, కోశాధికారి చిప్ప దేవదాస్, కార్యవర్గ సభ్యుడు దొంతుల ప్రతాప్ పాల్గొన్నారు.
ఢిల్లీ షాకింగ్ ఘటన... యువతి పొట్టలోంచి 1.16 కిలోల వెంట్రుకల ముద్ద తొలగింపు!
Posted On 2026-09-03 09:31:35
Readmore >
ఎల్లారెడ్డిపేటలో యూరియా కోసం రైతుల అవస్థలు... PACS ఎదుట భారీ ధర్నా
Posted On 2026-09-03 09:21:29
Readmore >
భార్య మృతితో మనస్తాపం... చెట్టుకు ఉరేసుకుని వృద్ధుడి ఆత్మహత్య
Posted On 2026-09-03 07:53:15
Readmore >
జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం
Posted On 2026-09-01 17:18:53
Readmore >
రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు
Posted On 2026-09-01 16:34:15
Readmore >
జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి
Posted On 2026-09-01 16:30:44
Readmore >