Posted on 2024-09-06 13:57:47
కందుకూర్ ను మున్సిపాలిటీగా చేయాలని నేతల డిమాండ్
ప్రజాభిప్రాయ సేకరణ చేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు
మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: కందుకూర్ మండలానికి నాల్గో సిటీ రావటంతో ఈ ప్రాంతం మహానగరంగా మారనుందని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి అన్నారు. తుక్కుగూడ కార్యాలయంలో కేఎల్ఆర్ ను కలిసి కందుకూర్ ను మున్సిపాలిటీగా మార్చాలని హస్తం నేతలు కోరారు. జనాభా పెరగటం, ఫార్మాసిటీ, ఫోర్త్ సిటీతో మరింత అభివృద్ధి కానుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. మండలంలోని 16 గ్రామాలను విలీనం చేసి మున్సిపాలిటీగా మారిస్తే బాగుంటుందని కందుకూర్ మండల నాయకులు కేఎల్ఆర్ దృష్టికి తెచ్చారు. ఈమేరకు ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి అందిస్తామని కేఎల్ఆర్ హామీ ఇచ్చారు. ఇప్పటికే మహేశ్వరం మండల కేంద్రాన్ని 12 గ్రామపంచాయతీలతో మున్సిపాలిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్లు లక్ష్మారెడ్డి తెలిపారు. ప్రజాభిప్రాయ సేకరణ చేసి సీఎంవోకు పంపుతామని కిచ్చెన్నగారు కాంగ్రెస్ నేతలకు చెప్పారు. మహేశ్వరం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి మహానగరంగా మార్చుతామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిన విషయాన్ని కేఎల్ఆర్ గుర్తు చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం
Posted On 2026-09-07 16:41:28
Readmore >
దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-09-06 04:06:38
Readmore >
ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త
Posted On 2026-09-04 17:43:14
Readmore >