| Daily భారత్
Logo




బాధితులకు నిత్యవసర వస్తువులు అందజేసిన షాద్ నగర్ ఎమ్మెల్యే శంకర్, మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి

News

Posted on 2024-09-02 07:52:58

Share: Share


బాధితులకు నిత్యవసర వస్తువులు అందజేసిన షాద్ నగర్ ఎమ్మెల్యే శంకర్, మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి

ప్రకృతి బాధితులకు నిరంతరం అండగా ఉంటాం

తుఫాను బాధితులకు అండగా నిలిచిన కాంగ్రెస్

నియోజకవర్గ వ్యాప్తంగా ఒక్కో బాధిత కుటుంబానికి రూ. 10వేల సాయం

వారానికి సరిపడా నిత్యవసర సరుకుల పంపిణీ

షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: ప్రకృతి ప్రకోపానికి బలి అయిన బాధితులను కాంగ్రెస్ పార్టీ అక్కున చేర్చుకుని వారికి తక్షణ ఉపశమనం కల్పించేందుకు కాంగ్రెస్ పార్టీ సంకల్పించిందని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ స్పష్టం చేశారు. గత మూడు రోజులుగా ప్రకృతి విపత్తులతో నష్టపోయిన షాద్ నగర్ నియోజకవర్గం వ్యాప్తంగా బాధితులను ఆదుకునేందుకు కాంగ్రెస్ పార్టీ కదిలింది. మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి తదితర నియోజకవర్గ పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో ఫరూక్ నగర్ మండలంలో నష్టపోయిన ఒక్క కుటుంబానికి పదివేల రూపాయల ఆర్థిక సాయం అదేవిధంగా వారానికి సరిపడా నిత్యవసర సరుకులను పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ.. ప్రకృతి వికృతులు సహజమని ఇంత పెద్ద స్థాయిలో వర్షాలు కురిసి నష్టపోయిన ప్రజలను రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ఎల్లవేళలా సిద్ధంగా ఉంటుందని అన్నారు. కువైపు వర్షాలు సమృద్ధిగా కురిసి చెరువులు కుంటలు జలకళలాడుతుంటే మరోవైపు ప్రకృతి ప్రభుపానికి పేదలు నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. పైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ బాధితులను ఆదుకుంటుందని పేర్కొన్నారు. తుఫాను తాకిడికి నష్టపోయిన వారిని నిరంతరం సాయం అదే విధంగా అధికారులను కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నామని సూచించారు.

ప్రజల అండగా నిలుస్తాం - మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి 

నియోజకవర్గ వ్యాప్తంగా వర్షాల కారణంగా నష్టపోయిన ప్రజలకు ఎల్లవేళల అండగా ఉంటామని మాజీ ఎమ్మెల్యే సి ప్రతాప్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో వర్షం బాధితులకు నగదు తో పాటు నిత్యావసర వస్తువులను పంపిణీ చేసే కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నియోజకవర్గ వ్యాప్తంగా కురిసిన విస్తార వర్షాలకు అపారంగా నష్టపోయిన ప్రజలను వెంటనే ఆదుకుంటున్నామని తెలిపారు. ప్రభుత్వం అన్ని వర్గాలకు అండగా నిలుస్తుందని తెలిపారు. వర్షాలకు ఎవరు భయపడాల్సిన అవసరం లేదని తక్షణ సాయం అందించేందుకు అధికారులు కూడా సంసిద్ధులై ఉన్నారని ప్రతాప్ రెడ్డి సూచించారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మహమ్మద్ అలీ ఖాన్ బాబర్, యాదయ్య యాదవ్, బాలరాజ్ గౌడ్, తిరుపతి రెడ్డి, పట్టణ అధ్యక్షుడు కొంకల్ల చెన్నయ్య, శ్రీకాంత్ రెడ్డి, అగనూరు బస్వం, కుమార్ స్వామీ, డంగు శ్రీనివాస్ యాదవ్, హరినాథ్ రెడ్డి, కృష్ణారెడ్డి, అందే మోహన్, సింగారం సుదర్శన్, ఇబ్రాహీం, లింగారెడ్డిగూడెం అశోక్, సీతారాం, ముబారక్ అలీ ఖాన్, సయ్యద్ ఖదీర్, గంగమోని సత్తయ్య, నడికుడ యాదగిరి యాదవ్, చంద్రశేఖర్, మురళీమోహన్,నరేష్,జగదీశ్వర్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు..

Image 1

కోదాడలో 10 ఇళ్ల దొంగతనం కేసులు ఛేదింపు... రూ.60 లక్షల బంగారంతో హైదరాబాద్ దొంగ అరెస్ట్

Posted On 2026-09-09 14:45:53

Readmore >
Image 1

స్పీకర్ కు బీఆర్ఎస్ బహిరంగ క్షమాపణ చెప్పాలి

Posted On 2026-09-09 14:29:32

Readmore >
Image 1

దేమేకలాన్ పాఠశాలలో ఘనంగా కలోజి నారాయణరావు జయంతి వేడుకలు

Posted On 2026-09-09 14:28:15

Readmore >
Image 1

జర్నలిస్టుల సంక్షేమానికి కృషి

Posted On 2026-09-09 08:35:55

Readmore >
Image 1

తెలుగు సాహిత్యానికి ప్రజాకవి కాళోజీ సేవలు చిరస్మరణీయం... ఎస్పీ మహేష్ బి.గితే

Posted On 2026-09-09 08:34:54

Readmore >
Image 1

నామకరణ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర డైరెక్టర్ ఆర్.టి.ఐ చట్టం... ఎంఎ సలీం

Posted On 2026-09-08 18:02:08

Readmore >
Image 1

వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో శ్రావణమాసం కుంకుమ పూజలు

Posted On 2026-09-08 18:01:01

Readmore >
Image 1

బాబు… అని పిలవాలని ఉన్నది…మంజుల పత్తిపాటి

Posted On 2026-09-08 08:44:38

Readmore >
Image 1

కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం

Posted On 2026-09-07 16:41:28

Readmore >
Image 1

నకిలీ హిజ్రా మాఫియాపై పోలీసుల ఉక్కుపాదం

Posted On 2026-09-07 04:33:05

Readmore >