| Daily భారత్
Logo




జైలుకు క్రిప్టో ఎక్సేంజీ వ్యవస్థాపకుడు

News

Posted on 2023-11-03 18:52:06

Share: Share


జైలుకు క్రిప్టో ఎక్సేంజీ వ్యవస్థాపకుడు

రూ.80వేల కోట్ల మోసం కేసు శామ్‌ బాంక్‌మన్‌కు న్యూయార్క్‌ కోర్టు శిక్ష

డైలీ భారత్, న్యూయార్క్‌ : క్రిఫ్టో ఎక్సేంజీ ఎఫ్‌టిఎక్స్‌ ఫౌండర్‌, సిఇఒ శామ్‌ బాంక్‌మన్‌ను న్యూయార్క్‌ కోర్టు దోషిగా తేల్చింది.ఆర్థిక మోసాలు, అక్రమ నగదు చలామణి వంటి నేరాలకు పాల్పడినట్లు నిర్ధారణ అయ్యింది. క్రిప్టో కరెన్సీ పరిశ్రమలో శామ్‌ను కింగ్‌గా భావిస్తారు. గురువారం న్యూయార్క్‌ కోర్టు ఇచ్చిన తీర్పుతో 31 ఏళ్ల శామ్‌ బాంక్‌మన్‌ ప్రతిష్ట మొత్తం పోయింది. ఆర్థిక మోసాలకు పాల్పడిన శామ్‌కు 10 ఏళ్ల పాటు జైలు శిక్ష విధించింది.

క్రిప్టో ఎక్సేంజీ ప్రారంభించిన అనాతి కాలంలోనే ఆయన సంపద 26 బిలియన్‌ డాలర్లకు (దాదాపు రూ.2 లక్షల కోట్లకు) ఎగిసింది. నిధుల దుర్వినియోగం, కృత్రిమ క్రిప్టో ధరలు, మనీలాండరింగ్‌ తదితర అక్రమాలకు పాల్పడిందనేది ప్రధాన అరోపణ. తమసంస్థ దివాలా తీసినట్లు ఎఫ్‌టిఎక్స్‌ స్వయంగా గతేడాది నవంబర్‌లో ప్రకటించింది. దీనిపై విచారించిన న్యూయార్క్‌ కోర్టు దాదాపు 10 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.80వేల కోట్ల) విలువైన ఆర్థిక నేరానికి పాల్పడినట్లు తేల్చింది. ఇది అమెరికా చరిత్రలోనే అతిపెద్ద ఆర్థిక మోసాల్లో ఒకటని కోర్టు పేర్కొంది. ఈ వ్యవహారంలో బ్యాంక్‌మన్‌తో పాటు మరో ముగ్గురూ తమ తప్పులను కోర్టు ముందు అంగీకరించడంతో వారిని దోషిగా తేల్చింది.

Image 1

వెంకట సాయి నగర్ కాలనీలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

Posted On 2026-08-15 07:51:52

Readmore >
Image 1

ఆటో కార్మికులతో కలిసి స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న బిజెపి నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-08-15 07:33:17

Readmore >
Image 1

డీఐజీలమంటూ ఫేక్ ఐడీలు... భార్యాభర్తల లక్షల మోసం...

Posted On 2026-08-15 06:37:39

Readmore >
Image 1

భూ వివాదం నేపథ్యంలో వ్యక్తిపై పారతో దాడి.. ఇద్దరు అరెస్ట్

Posted On 2026-08-15 03:41:51

Readmore >
Image 1

"బెస్ట్ సైకాలజిస్ట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్న పున్నంచందర్"

Posted On 2026-08-14 18:18:19

Readmore >
Image 1

కాంట్రాక్టర్ల పైన ఉన్న ప్రేమ తెలంగాణ విద్యార్థుల పైన కాంగ్రెస్ పార్టీకి లేదు

Posted On 2026-08-14 18:10:20

Readmore >
Image 1

ఎల్లమ్మ ఆలయంలో బంగారు ముక్కుపోగుల చోరీ కేసు ఛేదన

Posted On 2026-08-14 18:08:46

Readmore >
Image 1

ప్రతి సోమవారం మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమాలు – ఆగస్టు 17 నుంచి ప్రారంభం

Posted On 2026-08-14 18:05:57

Readmore >
Image 1

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ కోసం వృద్ధురాలిని ఇనుప రాడ్‌తో కొట్టి హత్య చేసిన యువకుడు

Posted On 2026-08-14 18:03:54

Readmore >
Image 1

ఫేక్ డాక్టర్ కేసు... రంగంలోకి దిగిన సర్కార్.. ఒకరి తర్వాత ఒకరు ముగ్గురు వైద్యుల సస్పెన్షన్!

Posted On 2026-08-14 09:52:38

Readmore >