Posted on 2024-08-05 23:32:15
సరిహద్దుల్లో సైనిక విన్యాసాల రిహార్సల్స్... బుల్లెట్ల మోత...
రోహింగ్యాల గుడిసెలను తగులబెట్టిన సైన్యం... బంగ్లాదేశ్‌లో ఉద్రిక్తత.
డైలీ భారత్, బంగ్లాదేశ్: దక్షిణాసియాలో ఇప్పుడు మరో దేశంలో అస్థిరత నెలకొంది. మన పొరుగుదేశం బంగ్లాదేశ్ ఇప్పుడు మిలటరీ చేతుల్లోకి వెళ్లిపోయింది. ఆర్మీ హెచ్చరికలతో ప్రదాని పదవికి రాజీనామా చేసి షేక్ హసీనా భారత్ కు ఆశ్రయం కోరి వచ్చారు. ప్రస్తుం షేక్ హసీనా భారత్ లోనే ఉన్నట్లు సమాచారం. ఇటీవల శ్రీలంకలో ఆర్థిక మాంద్యం కారణంగా ప్రజలు తిరగబడి ప్రధాని నివాసంలోకి చొరబడి అక్కడ బీభత్సం సృష్టించిన విషయం మనకు తెలిసిందే. ఇప్పుడు తాజాగా బంగ్లాదేశ్ లోనూ షేక్ హసీనా నివాసం ఉండే భవనంలోకి ఆందోళనకారులు చొరబడి అందిన కాడికి వస్తువులను దోచుకెళ్లారు. సైన్యం ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. చివరకు బంగ్లాదేశ్ లో సైనిక పాలన విధించారు. అయితే అసలు బంగ్లాదేశ్ లో దేనికోసం ఆందోళనలు జరుగుతున్నాయి? ప్రశాంతంగా ఉన్న దేశం అసస్మాత్తుగా వార్తలలో హాట్ టాపిక్ గా ఎందుకు మారిందో ఇప్పుడు తెలుసుకుందాం.
అసలు ఇప్పుడు బంగ్లాదేశ్ లో ఆందోళనలు ఎందుకు జరుగుతున్నాయ్
1971 సంవత్సరంలో బంగ్లాదేశ్‌కు స్వాతంత్ర్యం వచ్చింది. ఈ క్రమంలోనే బంగ్లాదేశ్ స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసినవారి కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 30 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ 1972లో అప్పటి ప్రధాని, బంగ్లా జాతి పిత, షేక్ హసీనా తండ్రి షేక్ ముజిబుర్ రెహ్మాన్.. ఒక చట్టం తీసుకువచ్చారు. అయితే బంగ్లాదేశ్ ప్రభుత్వ ఉద్యోగాలలో మెరిట్ ఆధారిత విధానాన్ని ప్రవేశపెట్టాలని ఆ దేశ యువత చాలాకాలంగా కోరుతోంది. అనేక నిరసన కార్యక్రమాలు కూడా యువత చేపట్టారు. 2018లో నిరసనలు తీవ్ర రూపం దాల్చడంతో అప్పటి షేక్ హసీనా ప్రభుత్వం ఆ రిజర్వేషన్లను రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రిజర్వేషన్లను రద్దు చేస్తూ షేక్ హసీనా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 1971లో మృతిచెందిన స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబ సభ్యులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతొ ఆ పిటిషన్లను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు.. ఈ ఏడాది జూన్‌లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కొట్టిపారేస్తూ సంచలన తీర్పు వెలువరించింది. దీంతో ఆ రిజర్వేషన్ల కోటా వ్యవస్థ మళ్లీ అమల్లోకి వచ్చింది. కోర్టు కొత్త ఆదేశాలతో.. ప్రభుత్వ ఉద్యోగాల్లో 56 శాతం కోటా.. ప్రత్యేక గ్రూపులకు రిజర్వ్ చేశారు. ఫ్రీడం ఫైటర్ల మనవళ్లు, మనవరాళ్లు, మహిళలకు రిజర్వేషన్లను పెంచారు. దీంతో బంగ్లాదేశ్‌లో నిరుద్యోగ యువత ఆందోళనకు దిగింది. ఫ్రీడం ఫైటర్ల కుటుంబాల్లో మూడో తరానికి ఎందుకు రిజర్వేషన్ ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.మెరిట్ ఆధారంగా పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
"సిరిసిల్లలో కలకలం : బాలాజీ స్వీట్ షాప్ మిక్చర్‌లో బల్లి, యజమానిపై కేసు నమోదు"
Posted On 2026-07-01 07:14:21
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ మోసం బట్టబయలు : తల్లి అరెస్ట్, కొడుకు కోసం గాలింపు
Posted On 2026-06-30 18:35:12
Readmore >
ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ లోని పీఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతన తరగతి గదులు ప్రారంభించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే
Posted On 2026-06-30 18:09:24
Readmore >
ఎక్సైజ్ సూపర్డెంట్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు R భాగయ్య
Posted On 2026-06-30 18:03:18
Readmore >
మూడు దశాబ్దాలకు పైగా పోలీసు శాఖలో విశిష్ట సేవలు అందించిన నలుగురు అధికారులకు ఘన వీడ్కోలు
Posted On 2026-06-30 18:02:24
Readmore >
శ్రీ సర్వదేవ పరంజ్యోతి భగవతి ఆలయం కల్కి ఆలయంలో అన్న ప్రసాద వితరణ
Posted On 2026-06-30 18:00:06
Readmore >
పదవీ విరమణ పొందిన ఉషయ్యకు ఘన సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్
Posted On 2026-06-30 17:58:38
Readmore >
ఆగిన బడిబాటకు మళ్లీ ఊపిరి... రామ్ చరణ్‌కు శ్రీమాతా సేవ చారిటబుల్ అండ"
Posted On 2026-06-30 13:21:42
Readmore >
ప్రేమోన్మాది ఘాతుకం : పెళ్లికి నిరాకరించిందని యువతి దారుణ హత్య
Posted On 2026-06-30 08:20:14
Readmore >