| Daily భారత్
Logo




తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరియు షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చిత్రపటాలకు పాలాభిషేకం

News

Posted on 2024-08-02 12:17:01

Share: Share


తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరియు షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చిత్రపటాలకు పాలాభిషేకం

నాయి బ్రాహ్మణ షాద్ నగర్ పట్టణ అధ్యక్షుడు రోమియో రమేష్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహణ

నాయి బ్రాహ్మణుల గురించి అసెంబ్లీలో ప్రస్తావించిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కు ప్రత్యేక ధన్యవాదాలు

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: నిన్న జరిగిన అసెంబ్లీలో బీసీ కులాల గురించి ప్రస్తావించిన షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కు, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లకు రంగారెడ్డి జిల్లా షాద్నగర్ ముఖ్య కూడలిలో పాలాభిషేకం చేసిన నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు. మొదటగా డా:బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలు వేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. నాయి బ్రాహ్మణ టౌన్ అధ్యక్షుడు రోమియో రమేష్ మాట్లాడుతూ,, అసెంబ్లీలో  వెనుకబడ్డ బీసీ కులాలు, మంగలి, సాకలి, కుమ్మరి కులాలు గురించి ప్రస్తావించిన షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నాయి బ్రాహ్మణులకు ప్రజాస్వామ్య బద్ధంగా న్యాయం జరగడంలేదని అన్నారు. పార్టీలకు అతీతంగా మాట్లాడిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మరియు ఎమ్మెల్యే వీర్లపల్లికి శంకర్ కు ధన్యవాదాలు తెలిపారు. వృత్తిపై ఆధారపడి బతికే నాయి బ్రాహ్మణులకు వ్యతిరేకంగా వేరే జాతుల వారు ఈ వృత్తి చేయడం వల్ల వీరు ఉపాధి కోల్పోవడం జరుగుతుందని దీనితో వీరి కుటుంబం రోడ్డున పడే అవకాశం కూడా ఉందన్నారు. గతంలో కొన్ని వృత్తులకు జీవో అమలు చేసిన విధంగా, మా వృత్తికి ప్రత్యేక జీవో ప్రకటించాలని కోరారు. అదేవిధంగా మొదటగా కార్పొరేట్ వ్యవస్థను రద్దు చేయాలినీ మనవి చేసారు.

ఈ కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ టౌన్ అధ్యక్షుడు రోమియో రమేష్, మండల బీసీ సెల్ అధ్యక్షుడు బసవప్ప, నాయి బ్రాహ్మణ సంఘం కన్వీనర్ జి బాలరాజు, టౌన్ ప్రధాన కార్యదర్శి జంగయ్య, పశుపుల శ్రీనివాస్, మందారం నరసింహులు, వెంకటముని,వెంకటయ్య, నరేందర్, మధు, కృష్ణ, నర్సింలు, ప్రకాష్, శ్రీకాంత్, అంచయ్య, నరేష్, విశాల్  మరియు తదితరులు పాల్గొన్నారు.

Image 1

సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు...

Posted On 2026-07-04 16:57:14

Readmore >
Image 1

ఆహార కల్తీపై హెచ్‌-ఫాస్ట్‌ ఉక్కుపాదం!

Posted On 2026-07-04 15:07:29

Readmore >
Image 1

అడవి జంతువుల వల్ల పంట నష్టాన్ని PMFBY పరిధిలోకి తీసుకురావాలి : కవయిత్రి మంజుల పత్తిపాటి

Posted On 2026-07-04 14:03:34

Readmore >
Image 1

కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంతో ప్రజలకు మరింత చేరువైన కామారెడ్డి పోలీసులు

Posted On 2026-07-04 13:59:26

Readmore >
Image 1

ఏసీబీ వలలో తిరుపతి జిల్లా మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్

Posted On 2026-07-04 07:18:45

Readmore >
Image 1

భద్రాద్రి జిల్లా చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ గా సంజీవరావు జిల్లాకు చేసిన సేవలు అనేకం

Posted On 2026-07-03 23:06:05

Readmore >
Image 1

అపర్ణ కుటుంబాన్ని ఆదుకున్న జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రత్నకుమార్

Posted On 2026-07-03 23:04:17

Readmore >
Image 1

గిరిజన శివశక్తుల పూజారుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి

Posted On 2026-07-03 18:35:18

Readmore >
Image 1

స్పీడ్ పోస్ట్ ద్వారా జరుగుతున్న భారీ గంజాయి సరఫరా నెట్‌వర్క్‌ను చేదించిన హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్

Posted On 2026-07-03 18:34:08

Readmore >
Image 1

SIR కార్యక్రమాన్ని పరిశీలించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు

Posted On 2026-07-03 18:31:55

Readmore >