| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

చరిత్ర కలిగిన మొగలిగిద్దను మండలాన్ని చేయండి : ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ రెడ్డి

చరిత్ర కలిగిన మొగలిగిద్దను మండలాన్ని చేయండి : ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ రెడ్డి

మొగలిగిద్దను మండలం చేసేందుకు పరిశీలిస్తాం

రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

మాదాసి, మాదారి కురువల సమస్యను పరిష్కరించండి

ఆరోగ్యశ్రీలో తల సేమియా వ్యాధిగ్రస్తులను చేర్చండి

మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ కుమార్ రెడ్డి

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: ఎంతో చరిత్ర కలిగిన ఫరూక్ నగర్ మండలం మొగిలిగిద్ద గ్రామాన్ని మండలం చేయాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం జరిగిన శాసనమండలి సభలో ఎమ్మెల్సీ ఎన్. నవీన్ కుమార్ రెడ్డి ఈ అంశాన్ని ప్రస్తావించారు. దీనిపై శాసనమండలిలో రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందిస్తూ మొగలిగిద్దను మండలం చేసేందుకు ప్రభుత్వం పరిశీలిస్తుందని హామీ ఇచ్చారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. శాసనమండలిలో చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అనుమతితో ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ తెలియజేస్తూ నగర్ మండలం నుండి మొగిలిగిద్ద గ్రామాన్ని విడదీసి ప్రత్యేకంగా మండలం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఎంతో చరిత్ర కలిగిన మొగిలిగిద్ద మండలంలో అన్ని మౌలిక సదుపాయాలు ఉన్నాయని ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. మొగిలిగిద్ద గ్రామంలో ఉన్న ప్రభుత్వ హైస్కూల్ పాఠశాలకు 150 ఏళ్ల చరిత్ర ఉందని ఇందులోని హైదరాబాద్ స్టేట్ తొలి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు, ప్రొఫెసర్ హరగోపాల్, మాజీ గవర్నర్ సత్యనారాయణ రెడ్డి లాంటి ప్రముఖులు చదువుకున్న చరిత్ర గల గ్రామం ఇదని సభ దృష్టికి తెచ్చారు. మండలంలో మొత్తం 75 వేల జనాభా ఉంటుందని ఇందులో 35 వేల జనాభా కలిగిన 20 గ్రామపంచాయతీలను మొగలిగిద్దలో కలిపి మండలంగా చేయవచ్చని శాసనమండలికి ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి సూచించారు. దీనిపై స్పందించిన రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మొగలిగిద్ద గ్రామం మండలం చేయడం కోసం ప్రభుత్వం పరిశీలిస్తుందని చెప్పారు. అదేవిధంగా ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఆరోగ్యశ్రీలో తల సేమియా వ్యాధిగ్రస్తులను చేర్చాలని ప్రభుత్వాన్ని కోరారు. తల సేమియా వ్యాధిగ్రస్తులు ప్రతి నెల రక్తం కోసం ఎంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలిపారు. తన నియోజకవర్గంలోని గూడూరు గ్రామంలో ఓ బాబుకు తల సేమియా వస్తే రెండు ఎకరాలు అమ్మి బెంగళూరులో వైద్యం చేయించారని దీనికి అక్షరాల 70 లక్షల రూపాయలు ఖర్చయ్యాయని చెప్పారు. ఆరోగ్యశ్రీలో తల సేమియా వ్యాధిగ్రస్తులను చేర్చితే ఎంతో ప్రయోజనంగా ఉంటుందని నవీన్ కుమార్ రెడ్డి ఈ సందర్భంగా సభను కోరారు. అదేవిధంగా మాదాసి కురువ ఎస్సి సర్టిఫికెట్ల అంశాన్ని ప్రస్తావించగా చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి దానికి సంబంధించి ముందుగా పిటిషన్ ఇవ్వాలని సూచించడంతో దానికి పిటిషన్ ఇస్తామని నవీన్ కుమార్ రెడ్డి అన్నారు.

మాదాసి, మాదారి కురువల సమస్యను పరిష్కరించండి

ఉమ్మడి పాలమూరు జిల్లాలో మాదాసి కురువల కుల ధ్రువీకరణ పత్రాలు సమస్య ఎంతో కాలంగా నానుతోందని 

దీనిని ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి శాసనమండలిలో ప్రత్యేకంగా ప్రశ్నించారు. కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో ఎక్కువగా జీవిస్తున్న మాదాసి మదారి కురువ ప్రజలకు ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రాలు ఇస్తామని గత ఎన్నికల్లో నాయకులు కూడా వాగ్దానాలు చేశారని, ఇప్పుడు కుల దృవీకరణ పత్రాలను వారికి అందజేయాలని నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. దీనికి సంబంధించి ఎస్సీ కార్పొరేషన్ జారీ చేసిన కొన్ని జీవో పత్రాలు శాసనమండలికి సమర్పిస్తున్నట్టు చెప్పారు. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని హామీ ఇచ్చిన విధంగా మాదాసి మాదారి కురువలకు ఎస్సీ కుల దృవీకరణ పత్రాలు అందజేయాలని సభలో కోరారు..

Previous 50 లక్షల చోరీ కేసును ఛేదించిన పోలీసులు
Next తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరియు షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చిత్రపటాలకు పాలాభిషేకం
ADVERTISEMENT