Posted on 2024-08-01 18:46:32
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్గీకరణ ను అమలుచేస్తాం అని అసెంబ్లీలో ప్రకటించారు..
ఇప్పటికే ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లకు కూడా వర్గీకరణ ను వర్తిపజేస్తాం అన్న ముఖ్యమంత్రి కి ధన్యవాదాలు
ఓయూ జేఏసీ చైర్మన్ కొత్తపల్లి తిరుపతి
డైలీ భారత్, తెలంగాణ డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అంశంలో సుప్రీంకోర్టు ఈ రోజు స్పష్టమైన తీర్పు ను ఇచ్చింది. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కు అనుకూలంగా సుప్రీంకోర్టు ఈ రోజు ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకమైనది ఈ తీర్పును స్వాగతిస్తున్నాం అని ఓయూ జేఏసీ చైర్మైన్ కొత్తపల్లి తిరుపతి అన్నారు. సుప్రీంకోర్టు లో తీర్పు వెలువడిన వెంటనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అంశంపై మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఏడుగురు జడ్జీల రాజ్యాoగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును తెలంగాణ లో వెంటనే అమలు చేస్తామని అసెంబ్లీలో ప్రకటించారు. అంతేకాకుండా తెలంగాణ లో ఇప్పటికే ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్ల భర్తీలో కూడా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను అమలు చేస్తామని ప్రకటించడం సంతోషాదాయకం అని అన్నారు. దాదాపు ఇరవై సంవత్సరాల న్యాయమైన పోరాటం పలించిందన్నారు. ఈ తీర్పు పట్ల తెలంగాణ రాష్ట్రంలో ని SC విద్యార్థులు, యువకులు, విద్యావంతులు, మేధావులు హర్షం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో పులిగంటి వేణు కాంగ్రెస్ నాయకులు, రాజు, శ్రీనివాస్, సాయి, రాము, ప్రశాంత్, మహేష్, ఆంజనేయులు, రంజిత్ తదితరులు పాల్గొన్నారు.
తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
Posted On 2026-07-05 19:39:21
Readmore >
సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు...
Posted On 2026-07-04 16:57:14
Readmore >
అడవి జంతువుల వల్ల పంట నష్టాన్ని PMFBY పరిధిలోకి తీసుకురావాలి : కవయిత్రి మంజుల పత్తిపాటి
Posted On 2026-07-04 14:03:34
Readmore >