| Daily భారత్
Logo




వికలాంగులందరికి ఒకే యుడిఐడి కార్డు జారీచేయాలి : అశాన్నగారి భుజంగరేడ్డి

News

Posted on 2024-08-01 16:39:16

Share: Share


వికలాంగులందరికి ఒకే యుడిఐడి కార్డు జారీచేయాలి : అశాన్నగారి భుజంగరేడ్డి

వైకల్య ధ్రువీకరణ పత్రం పొందేందుకు 2016 ఆర్పిడి చట్టానికి సవరణలు చేయాలనే గెజిట్ ను రద్దు చేయాలి

వికలాంగుల హక్కుల జాతీయ వేదిక రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు అశాన్నగారి భుజంగరేడ్డి

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: వికలాంగులందరికి ఒకే యుడిఐడి కార్డు జారీచేయాలి అశాన్నగారి భుజంగరెడ్డి అన్నారు. వికలాంగుల వైకల్య ధ్రువీకరణ పత్రాలు పొందేందుకు నిబంధనలను కఠినతరం చేస్తూ 2016 ఆర్పిడిచట్టంలోని సెక్షన్ 20కి సవరణలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ముసయిదాను నోటిఫికేషన్ గెజిట్ ను రద్దు చేయాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఎన్పిఆర్డి రంగారెడ్డి జిల్లా కమిటీ  డిమాండ్ చేస్తుంది.

ట్రైని ఐఏఎస్ పూజా ఖేడ్కర్ పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో వైకల్య ధ్రువీకరణ పత్రం పొందెందుకు నిబంధనలు కఠినంతరం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం సరైంది కాదు.ఇప్పటి వరకున్న నిబంధనల ప్రకారం వైకల్య ధ్రువీకరణ పత్రం కోసం దరఖాస్తూ దారులు నివాస రుజువు మరియు ఫోటో మాత్రమే సమర్పించాలి.సవరించిన నిబంధనల ప్రకారం 6నెలల లోపు దిగిన ఫోటో, ఆధార్ కార్డు తప్పని సరిగా సమర్పించాలి.వైకల్య ధ్రువీకరణ పత్రాల కోసం దరఖాస్థులను స్వీకరించడానికి మరియు ప్రాసెస్ చేయడానికి వైద్య అధికారులు మాత్రమే సమర్థులుగా పరిగనించాలని ముసాయిదాలో సవరణలు ప్రతిపదించడం సరైంది కాదు.దరఖాస్థులను ప్రాసెస్ చేయడానికి పట్టే సమయాన్ని 1నెల నుండి 3నెలలకు పెంచాలని ప్రతిపాధన చేయడం అంటే వికలాంగులను ఇబ్బందులకు గురిచేయడమే అవుతుంది.

ప్రభుత్వం చేస్తున్న సవరణలు నకిలీ వైకల్య ధ్రువీకరణ పత్రాలు పొందకుండా ఆపలేవని, ప్రభుత్వం కొత్తగా పెడుతున్న నిబంధనలు నిజమైనా వికలాంగులు సర్టిఫికెట్ పొందడం కస్టమవుతుంది.గత సంవత్సరం కేంద్ర ప్రభుత్వం వికలాంగులు సంక్షేమ పథకాలు పొందాలంటే యుడిఐడి కార్డు తప్పని సరిగా ఉండాలని,  యుడిఐడి కార్డు కు ఆధార్ అనుసంధానం చేయాలని నిర్ణయం చేసింది. ప్రస్తుతం యుడిఐడి కార్డు జారీ చేయడానికి 6నెలల కంటే ఎక్కువ సమయం పడుతుంది,యుడిఐడి కార్డులు జారీ చేయడానికి మరియు వైకల్య ధ్రువీకరణ పత్రం జరిచేయడానికి కావాల్సిన సమయాన్ని తగ్గించకుండా ఎందుకు పెంచుతున్నారు.2016 ఆర్పిడి సెక్షన్ 18(2)ప్రకారం దరఖాస్తూ స్వీకరించిన నెలలోపు సర్టిఫికెట్స్ జారీ చేయాలని వైద్య అధికారులను ఆదేశిస్తుంది. మారిన సవరణ ప్రకారం వైకాల్యం నిర్ధారణ అయితేనే 3 నెలల లోపు సర్టిఫికెట్ జారీ చేయాలని సూచిస్తుంది. వైకల్య శాతన్ని బట్టి యుడిఐడి కార్డులు జరిచేయాలని, 40 శాతం లోపు ఉన్నా వారికి తెలుపు కార్డు, 40-80 శాతం వైకాల్యం ఉన్నవారికి పసుపు కార్డు, మరియు 80 నుండి 100 శాతం ఉన్నావారికి బ్లు కార్డులు జారీ చేయాలని  చేసిన 

ప్రతిపాధన సరైనది కాదు. యుడిఐడి కార్డులు వైకల్య శాతన్ని బట్టి కలర్లో జారిచేయడం అంటే వికలాంగుల మధ్య శత్రుత్వం పెరుగుతుంది. సాటి వికలాంగుల మధ్య వివక్షత మరియు వేధింపులు పేరిగే అవకాశం ఉంది. యుడిఐడి కార్డులో వికలాంగుల పూర్తి సమాచారం ఉంటుంది. అలాంటప్పుడు వైకల్య శాతం ఎందుకు బహిరంగoగా కనిపించేలా చేయాలి. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం వికలాంగులకు మరిన్ని సమస్యలను తెచ్చిపెడుతుంది.

దరఖాస్తూ చేసిన 2 సంవత్సరాలలోపు సర్టిఫికెట్ రాకుంటే మళ్ళీ కొత్తగా దరఖాస్తూ చేయాలని ప్రతిపాదన చేయడం అంటే వికలాంగులను మరింత ఇబ్బందులకు గురిచేయడమే అవుతుంది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ రద్దు చేయాలని, వైకల్య ధ్రువీకరణ పత్రం పొందడానికి మార్గదర్శకాలు సులభతరం చేయాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక రంగారెడ్డి జిల్లా కమిటీ డిమాండ్ చేస్తుంది. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రదాన కార్యదర్శి జేర్కోని రాజు,జిల్లా కోశాధికారి నాగార్జున శ్రీనివాస్                   వికలాంగుల హక్కుల జాతీయ వేదిక రంగారెడ్డి జిల్లా కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Image 1

ప్రియుడి కోసం భర్తను హత్య చేసిన భార్య

Posted On 2026-07-06 08:04:19

Readmore >
Image 1

తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

Posted On 2026-07-05 19:39:21

Readmore >
Image 1

కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు

Posted On 2026-07-05 19:32:47

Readmore >
Image 1

ఇంటింటా ఎన్యూమరేషన్ ఫారాలను అందించిన వార్డ్ కౌన్సిలర్

Posted On 2026-07-05 19:30:41

Readmore >
Image 1

కాలినడక ద్వారా తిరుమలకు చేరిన 116 ఏళ్ల వృద్ధురాలు

Posted On 2026-07-05 17:09:50

Readmore >
Image 1

ఒవైసీ కాలేజ్ నిర్మాణాలపై తెలంగాణ హైకోర్టు సీరియస్!!

Posted On 2026-07-05 17:08:44

Readmore >
Image 1

ఏలూరు జిల్లాలో విషాదం... రైలు ఢీకొని నలుగురి మృతి

Posted On 2026-07-05 11:44:43

Readmore >
Image 1

సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు...

Posted On 2026-07-04 16:57:14

Readmore >
Image 1

ఆహార కల్తీపై హెచ్‌-ఫాస్ట్‌ ఉక్కుపాదం!

Posted On 2026-07-04 15:07:29

Readmore >
Image 1

అడవి జంతువుల వల్ల పంట నష్టాన్ని PMFBY పరిధిలోకి తీసుకురావాలి : కవయిత్రి మంజుల పత్తిపాటి

Posted On 2026-07-04 14:03:34

Readmore >