Posted on 2024-08-01 16:38:09
తెలంగాణ మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు జాంగారి రవి
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: న్యాయబద్ధమైన ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు ఆమోదం తెలిపిన ఈ శుభ సందర్భంగా షాద్ నగర్ చౌరస్తా లో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహం కు పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా జాంగారి రవి మాట్లాడుతూ.. మాదిగ జాతి 30 ఏళ్ల కళను సహకారం చేసిన కేంద్ర ప్రభుత్వముకు, తెలంగాణ రాష్ట్రం ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డికి దన్యవాదాలు. మాదిగ, మాదిగ ఉప కులాలకు వర్గీకరణకు వాయిదా తీర్మానం ఇస్తే గత ప్రభుత్వం సంపత్ కుమార్ ను సస్పెండ్ చేసింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో 2023 డిసెంబర్ 23న ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, దామోదర రాజనర్సింహ అడ్వకెట్ జనరల్ ను సుప్రీంకోర్టుకు పంపించారు. వర్గీకరణపై సుప్రీంకోర్టు లో న్యాయ నిపుణులతో వాదనలు వినిపించారు. ఎస్సీ వర్గీకరణ కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నం ఫలించింది. వర్గీకరణపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతున్నా. సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా ఏబీసీడీ వర్గీకరణ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం హర్షణీయం
ఇప్పుడు అమలులో ఉన్న ఉద్యోగ నోటిఫికేషన్ లో కూడా మాదిగ, మాదిగ ఉప కులాలకు రిజర్వేషన్లు అమలు చేసేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి అని కోరారు. ఆత్మగౌరవం కోసం, విద్యా ఉద్యోగ రాజకీయాల్లో వివక్షను ఎదిరిస్తూ సమాన వాటా కోసం మడిమ తిప్పకుండా పోరాడిన మాదిగ దండోరా నేతల కు,సోదర సోదరీమణులకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు, వర్గీకరణ డిమాండ్కు మద్దతుగా నిలిచిన రాజకీయ పార్టీల నాయకులకు, ప్రజాస్వామ్య వాదులు అందరికీ జాం గారి రవి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నేతలు చించేటి ప్రవీణ్, సింగపగ రవి, జాంగారి శ్రీకాంత్, అరవింద్, కల్యాణ్, వరప్రసాద్, తదితరులు పాల్గొన్నారు..
తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
Posted On 2026-07-05 19:39:21
Readmore >
సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు...
Posted On 2026-07-04 16:57:14
Readmore >
అడవి జంతువుల వల్ల పంట నష్టాన్ని PMFBY పరిధిలోకి తీసుకురావాలి : కవయిత్రి మంజుల పత్తిపాటి
Posted On 2026-07-04 14:03:34
Readmore >