| Daily భారత్
Logo




సమాధానం సభ్యుడు చెబితే ఎలా మంత్రి చెప్పాలి : ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి

News

Posted on 2024-08-01 15:47:03

Share: Share


సమాధానం సభ్యుడు చెబితే ఎలా మంత్రి చెప్పాలి : ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి

లీగల్ హెయిర్ సర్టిఫికెట్, ఆరోగ్యశ్రీ, రుణమాఫీ వ్యవహారాలపై శాసనమండలిలో ప్రసంగం ప్రసంగించిన ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా : శాసనమండలిలో తాను  సమస్యల పరిష్కారం కోసం ప్రశ్నిస్తే దానికి బదులుగా సభ్యుడు సమాధానం చెప్పడం సరికాదంటూ మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. గురువారం జరిగిన శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో 

ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి మాట్లాడారు. లీగల్ హెయిర్ సర్టిఫికెట్లను గతంలో తహసిల్దార్లు ఇచ్చేవారని, కానీ ఇప్పుడు ఆ బాధ్యత కోర్టులో చూసుకోవాలని చెబుతుండడంతో కొన్నిచోట్ల ఇబ్బందులు ఏర్పడుతున్నాయని ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని ఆర్థిక సమస్యలు ఏర్పడుతున్నాయని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి దృష్టికి తెచ్చారు. ఎప్పటిలాగే లీగల్ హెయిర్ సర్టిఫికెట్లను తహాసిల్దార్లు మంజూరు చేసేలా చూడాలని మండలి దృష్టికి తెచ్చారు. అదేవిధంగా ఆరోగ్యశ్రీ కార్డుకు 5 లక్షల నుండి పది లక్షలకు పెంపు బాగానే ఉన్నా అది ఆచరణలో అమలు విధానంలో కొన్ని మార్పులు చేర్పులు చేయాలని ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి సభకు సూచించారు. కార్పొరేట్ ఆసుపత్రులు ఇతర మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ కార్డు కింద వెంటనే చికిత్స జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఆసుపత్రులలో ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నవారికి సరైన వైద్యం లభించడం లేదని ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే వైద్యానికి భరోసా ఉండే విధంగా ప్రభుత్వం మార్గ నిర్దేశకాలు జారీ చేయాలని ఎమ్మెల్సీ సూచించారు. ప్రమాదాలు జరిగినప్పుడు లేదా ఇతర ఆపద సమయంలో బాధితుల వద్ద డబ్బులు లేక సోషల్ మీడియాలలో యాచిస్తుండడం చూస్తున్నామని ఇలాంటి వాటికి స్వస్తి పలికి ఆరోగ్యశ్రీ ఉందన్న భరోసా ప్రజలకు కలగాలని ఎమ్మెల్సీ సూచించారు. రాష్ట్రంలో రైతు రుణమాఫీ అంశంలో పట్టాదారు పాస్ బుక్ ను మాత్రమే ప్రామాణికంగా తీసుకోవాలని దీనికి రేషన్ కార్డు అనుసంధానం చేయాల్సిన అవసరం లేదని దీనివల్ల రైతులకు ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి చెప్పారు. రేషన్ కార్డు విషయంలో ప్రభుత్వం రైతులకు ఒక స్పష్టత ఇవ్వాలని కోరారు. అనేక విషయాలలో ప్రభుత్వం చొరవ తీసుకుంటుందని అవసరమైతే అసెంబ్లీలో ప్రతిపక్షాలను పక్కనపెట్టి ఏకపక్షంగా  బిల్లులు తీర్మానాలు చేస్తుందని ప్రభుత్వానికి చురకలు అంటించారు. అలాగే అంతే తొందరగా రేషన్ కార్డుల విషయంలో కూడా చొరవ చూపాలంటూ సభలో ప్రశ్నించగా ప్రతిపక్ష ఎమ్మెల్సీలు సమాధానం చెప్పబోయారు. దీంతో నవీన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తనకు జవాబు మంత్రి చెబితే బాగుంటుందని తోటి సభ్యులు సమాధానం చెప్పడం ఏమిటనీ? సభలో రుసరుసలాడారు. అయితే మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కల్పించుకొని సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం చెబుతారని సభ్యులు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని ఈ విషయంలో పట్టించుకోవద్దని చైర్మన్ నవీన్ కుమార్ రెడ్డికి చెప్పారు..

Image 1

ప్రియుడి కోసం భర్తను హత్య చేసిన భార్య

Posted On 2026-07-06 08:04:19

Readmore >
Image 1

తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

Posted On 2026-07-05 19:39:21

Readmore >
Image 1

కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు

Posted On 2026-07-05 19:32:47

Readmore >
Image 1

ఇంటింటా ఎన్యూమరేషన్ ఫారాలను అందించిన వార్డ్ కౌన్సిలర్

Posted On 2026-07-05 19:30:41

Readmore >
Image 1

కాలినడక ద్వారా తిరుమలకు చేరిన 116 ఏళ్ల వృద్ధురాలు

Posted On 2026-07-05 17:09:50

Readmore >
Image 1

ఒవైసీ కాలేజ్ నిర్మాణాలపై తెలంగాణ హైకోర్టు సీరియస్!!

Posted On 2026-07-05 17:08:44

Readmore >
Image 1

ఏలూరు జిల్లాలో విషాదం... రైలు ఢీకొని నలుగురి మృతి

Posted On 2026-07-05 11:44:43

Readmore >
Image 1

సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు...

Posted On 2026-07-04 16:57:14

Readmore >
Image 1

ఆహార కల్తీపై హెచ్‌-ఫాస్ట్‌ ఉక్కుపాదం!

Posted On 2026-07-04 15:07:29

Readmore >
Image 1

అడవి జంతువుల వల్ల పంట నష్టాన్ని PMFBY పరిధిలోకి తీసుకురావాలి : కవయిత్రి మంజుల పత్తిపాటి

Posted On 2026-07-04 14:03:34

Readmore >