Posted on 2024-08-01 13:37:12
డైలీ భారత్, ముస్తాబాద్: తాజాగా నిద్రిస్తున్న వృద్ధురాలిపై పిచ్చి కుక్కల దాడి చేయడంతో.. ఆమె మృతి చెందిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో చోటు చేసుకుంది. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ప్రకారం. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో సేవాలాల్ తండా గ్రామంలో పిట్ల రాజ్యలక్ష్మి( 80) అనే వృద్ధురాలు గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మంచానికి పరిమితం అయ్యింది. రాజ్యలక్ష్మిని దగ్గర్లో ఉన్న ఒక గదిలో ఉంచి.. రోజూ అన్నపానియాలు అందిస్తున్నారు. కాగా బుధవారం రాత్రి వృద్ధురాలికి భోజనం చేయించి, ఇంట్లో పడుకోబెట్టి వెళ్లారు కుటుంబ సభ్యులు.
రాత్రి నిద్రిస్తున్న సమయంలో పిచ్చి కుక్కలు ఇంట్లోకి ప్రవేశించి వృద్ధురాలిపై గుంపుగా దాడి చేశాయి. మొదటగా గొంతుపై దాడి చేసి, చంపి రాజ్యలక్ష్మి శరీరంలో చేతులు, మొహం, అవయవాలు పీక్కు తిన్నాయి. ఉదయం కొడుకులు, స్థానికులు చూసే సరికి రాజ్యలక్ష్మి తన ఇంట్లో విగత జీవిగా పడి ఉంది. దాడి చేసిన ఒక కుక్క అక్కడే ఉండటంతో ఆగ్రహించిన గ్రామ ప్రజలు దానిపై దాడి చేసి చంపేశారు. మృతురాలికి ముగ్గురు కొడుకులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుక్కల దాడిలో రాజ్యలక్ష్మి మృతి చెందడంతో గ్రామంలో విషాద వాతావరణం నెలకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
Posted On 2026-07-05 19:39:21
Readmore >
సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు...
Posted On 2026-07-04 16:57:14
Readmore >
అడవి జంతువుల వల్ల పంట నష్టాన్ని PMFBY పరిధిలోకి తీసుకురావాలి : కవయిత్రి మంజుల పత్తిపాటి
Posted On 2026-07-04 14:03:34
Readmore >