Posted on 2024-08-01 08:18:11
బోనాల వేడుకల్లో హాజరైన ఎమ్మెల్సీ ఎన్. నవీన్ కుమార్ రెడ్డి
హాజిపల్లి, మొగిలిగిద్ద, పిట్టలగూడలో ఘనంగా బోనాలు
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో తమ అధినేత కెసిఆర్ పెద్దపీట వేశారని మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. బుధవారం ఫరూక్ నగర్ మండలంలోని మొగిలిగిద్ద హాజీపల్లి, నందిగామ మండలం పిట్టలగూడ గ్రామాల్లో బోనాల వేడుకలకు అభిమానుల ఆహ్వానంపై వెళ్లారు. ఈ సందర్భంగా హాజీపల్లి మాజీ సర్పంచ్ మౌనిక మష్చందర్ ఆధ్వర్యంలో జరిగిన బోనాల వేడుకల్లో పాల్గొని వారిని అభినందించారు అదేవిధంగా మొగలిగిద్ద గ్రామంలో మాజీ ఎంపీటీసీ రాధాకృష్ణ మాజీ వార్డు సభ్యులు అదేవిధంగా బీఆర్ఎస్ గ్రామ యువ నాయకుడు గుట్ట రాజు మధు సుధీర్ తదితరుల ఆధ్వర్యంలో బోనాల వేడుకల్లో పాల్గొన్నారు. అలాగే పిట్టలగూడ గ్రామంలో కూడా కార్యకర్తల ఆహ్వానం మేరకు గ్రామంలో ఘనంగా జరిగిన బోనాలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా నవీన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సంస్కృతి సాంప్రదాయాలకు ఎంతో ఆసక్తి పెరిగిందని, ఆ దిశగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో కొత్త ఓరవడిని సృష్టించారని చెప్పారు. సంస్కృతి సంప్రదాయాల వల్ల గ్రామంలో ఐక్యత పెరుగుతుందని చెప్పారు. పూర్వికులు ఏం చేసినా భవిష్యత్తు తరాలను ఐకమత్యంగా ముందుకు నడిపే ఉద్దేశంతోనే ఇలాంటి కార్యక్రమాలకు పెద్దపీట వేశారని గుర్తు చేశారు..
తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
Posted On 2026-07-05 19:39:21
Readmore >
సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు...
Posted On 2026-07-04 16:57:14
Readmore >
అడవి జంతువుల వల్ల పంట నష్టాన్ని PMFBY పరిధిలోకి తీసుకురావాలి : కవయిత్రి మంజుల పత్తిపాటి
Posted On 2026-07-04 14:03:34
Readmore >