| Daily భారత్
Logo




రెవెన్యూ నక్ష విధించండి : ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి

News

Posted on 2024-07-31 20:13:25

Share: Share


రెవెన్యూ నక్ష విధించండి : ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా :షాద్ నగర్ నియోజకవర్గం కేశంపేట మండల పరిధిలోని చింతకుంటపల్లి గ్రామానికి భూములకు సంబంధించి రెవెన్యూ నక్ష లేకపోవడంతో భూ లావాదేవీలు జరపాలంటే ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయని గత కొన్ని ఏళ్లుగా నక్ష కోసం ప్రజా ప్రతినిధుల చుట్టూ తిరగడం జరుగుతుందని ఇప్పటివరకు కూడా ఆ దిశగా ఎవరు ప్రయత్నం చేయకపోవడం పట్ల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారంటూ గ్రామస్తులు మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ కుమార్ రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించడంతో ఆయన ఈరోజు శాసనమండలి ప్రశ్నోత్తరాల సమయంలో ఈ అంశాన్ని సభలో ప్రస్తావించారు. ఏదన్నా ఆపద సమయాన భూమి అమ్ముకోవాలన్న నక్ష ఇబ్బందులు ఎదురవుతున్నాయని గ్రామంలో మొత్తం 700 ఎకరాల పైచిలుకు భూములు ఉన్నాయని దీనికి సంబంధించిన నక్ష లేకపోవడంతో రెవెన్యూ రికార్డు పరంగా ఉన్న భూములను చూసుకోవాలంటే సాధ్య పడటం లేదని సభలో వివరించారు. సంబంధిత శాఖ మంత్రి ఈ అంశంలో స్పందించి గ్రామస్తులకు సమస్య పరిష్కారం చేయాలని మండలి ద్వారా కోరారు. శాసనమండలిలో తమ గ్రామ సమస్య వివరించినందుకు టిఆర్ఎస్ యువ నాయకులు రమేష్ యాదవ్ ఈ సందర్భంగా ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డికి పత్రికా ముఖంగా ధన్యవాదాలు తెలిపారు..

Image 1

ప్రియుడి కోసం భర్తను హత్య చేసిన భార్య

Posted On 2026-07-06 08:04:19

Readmore >
Image 1

తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

Posted On 2026-07-05 19:39:21

Readmore >
Image 1

కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు

Posted On 2026-07-05 19:32:47

Readmore >
Image 1

ఇంటింటా ఎన్యూమరేషన్ ఫారాలను అందించిన వార్డ్ కౌన్సిలర్

Posted On 2026-07-05 19:30:41

Readmore >
Image 1

కాలినడక ద్వారా తిరుమలకు చేరిన 116 ఏళ్ల వృద్ధురాలు

Posted On 2026-07-05 17:09:50

Readmore >
Image 1

ఒవైసీ కాలేజ్ నిర్మాణాలపై తెలంగాణ హైకోర్టు సీరియస్!!

Posted On 2026-07-05 17:08:44

Readmore >
Image 1

ఏలూరు జిల్లాలో విషాదం... రైలు ఢీకొని నలుగురి మృతి

Posted On 2026-07-05 11:44:43

Readmore >
Image 1

సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు...

Posted On 2026-07-04 16:57:14

Readmore >
Image 1

ఆహార కల్తీపై హెచ్‌-ఫాస్ట్‌ ఉక్కుపాదం!

Posted On 2026-07-04 15:07:29

Readmore >
Image 1

అడవి జంతువుల వల్ల పంట నష్టాన్ని PMFBY పరిధిలోకి తీసుకురావాలి : కవయిత్రి మంజుల పత్తిపాటి

Posted On 2026-07-04 14:03:34

Readmore >