| Daily భారత్
Logo




ఏసిపి చేతుల మీదుగా ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో నోట్ బుక్ ల పంపిణీ

News

Posted on 2024-07-31 17:36:04

Share: Share


ఏసిపి చేతుల మీదుగా ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో నోట్ బుక్ ల పంపిణీ

డైలీ భారత్, వేములవాడ: మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకుడు మధు మహేష్ 54 వ జన్మదిన సందర్భంగా ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఏసిపి శేషాద్రిని రెడ్డి చేతుల మీదుగా 60 మంది విద్యార్థిని, విద్యార్థులకు 420 ఫార్మెటివ్ అసైన్ మెంట్ బుక్కులు మరియూ  పెన్నుల పంపిణీ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపి శేషాద్రిని రెడ్డి మాట్లాడుతూ మిత్రులతో కలిసి ఏర్పాటు చేసిన వాట్సాప్ గ్రూప్ ద్వారా ఎంతో మందికి సహాయ సహకారాలు అందిస్తున్న మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు మధు మహేష్ కు జన్మదిన శుభాకాంక్షలు అదేవిధంగా ఎన్నో మంచి కార్యక్రమాలు నిర్వహిస్తూ సమాజానికి ఆదర్శంగా ఉండడం అభినందనీయమన్నారు.

ఈ సందర్భంగా మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు గొంగళ్ళ కుమార్ మాట్లాడుతూ కోవిడ్ సమయం నుండి నేటి వరకు 1192 రోజులుగా నిత్యం అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తూ నిరుపేద కుటుంబాలకు చెందిన వారికి ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ట్రస్ట్ ను ఆశ్రయించిన వారికి లేదనకుండా దాతల సహకారంతో ఆర్థిక సహాయాన్ని అందిస్తున్న చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు మధు మహేష్ జన్మదిన సందర్భంగా శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులతో ఇంకా ఎంతో మందికి సహాయ సహకారాలు అందించాలని కోరుతున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మై వేములవాడ చారిటబుల్  సభ్యులు నగుబోతు రవీందర్, మహమ్మద్ అబ్దుల్ రఫీక్, తోట రాజు, నక్క వేణు, పొలాస రాజేందర్, పసుల శ్రీనివాస్, గొండ ప్రసాద్, నక్క అశోక్, పాఠశాల సిబ్బంది యాదగిరి, కిషన్, బాలరాజు, ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు మరియూ విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

Image 1

ప్రియుడి కోసం భర్తను హత్య చేసిన భార్య

Posted On 2026-07-06 08:04:19

Readmore >
Image 1

తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

Posted On 2026-07-05 19:39:21

Readmore >
Image 1

కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు

Posted On 2026-07-05 19:32:47

Readmore >
Image 1

ఇంటింటా ఎన్యూమరేషన్ ఫారాలను అందించిన వార్డ్ కౌన్సిలర్

Posted On 2026-07-05 19:30:41

Readmore >
Image 1

కాలినడక ద్వారా తిరుమలకు చేరిన 116 ఏళ్ల వృద్ధురాలు

Posted On 2026-07-05 17:09:50

Readmore >
Image 1

ఒవైసీ కాలేజ్ నిర్మాణాలపై తెలంగాణ హైకోర్టు సీరియస్!!

Posted On 2026-07-05 17:08:44

Readmore >
Image 1

ఏలూరు జిల్లాలో విషాదం... రైలు ఢీకొని నలుగురి మృతి

Posted On 2026-07-05 11:44:43

Readmore >
Image 1

సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు...

Posted On 2026-07-04 16:57:14

Readmore >
Image 1

ఆహార కల్తీపై హెచ్‌-ఫాస్ట్‌ ఉక్కుపాదం!

Posted On 2026-07-04 15:07:29

Readmore >
Image 1

అడవి జంతువుల వల్ల పంట నష్టాన్ని PMFBY పరిధిలోకి తీసుకురావాలి : కవయిత్రి మంజుల పత్తిపాటి

Posted On 2026-07-04 14:03:34

Readmore >