| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

రౌడీ షీటర్లను హెచ్చరించిన షాద్ నగర్ సీఐ విజయ్ కుమార్

రౌడీ షీటర్లను హెచ్చరించిన షాద్ నగర్ సీఐ విజయ్ కుమార్

మంచి ప్రవర్తనతో ఉండాలి

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: సమాజంలో మంచి ప్రవర్తనతో కలిగి ఉండాలని అసాంఘిక కార్యకలాపాలతో సంబంధాలు ఉండకూడదని షాద్ నగర్ పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ పి విజయ్ కుమార్ రౌడీషీటర్లకు హెచ్చరిక జారీ చేశారు. బుధవారం పట్టణ పోలీస్ స్టేషన్ ఆవరణలో పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీషీటర్లను పిలిపించి వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు. మంచి ప్రవర్తన నడవడిక ఉండాలని సూచించారు. వివాదాలు ఘర్షణలు ఇతరత్రా అసాంఘిక కార్యకలాపాలతో సంబంధాలు ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని సిఐ వారిని హెచ్చరించినట్లు చెప్పారు..

Previous జర ఓపిక పట్టు... కేటీఆర్కు మంత్రి సీతక్క కౌంటర్
Next ఏసిపి చేతుల మీదుగా ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో నోట్ బుక్ ల పంపిణీ
ADVERTISEMENT