Posted on 2024-07-31 12:52:57
ఎలికట్టలో ఎమ్మెల్యే శంకర్ సన్మానించిన రైతులు మాజీ ఎంపిటిసి కావలి శ్రీశైలం తదితరులు ఆధ్వర్యంలో కార్యక్రమం
మాజీ ప్రధాని ఇందిరాగాంధీకి నివాళి అర్పించిన ఎమ్మెల్యే శంకర్
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: రైతు సంక్షేమంగా ఉంటేనే దేశం బాగుపడుతుందని దేశానికి వెన్నెముక రైతన్న అని రైతు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉందని రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ స్పష్టం చేశారు. ఫరూక్ నగర్ మండలం ఎలికట్ట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చల్లా శ్రీకాంత్ రెడ్డి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బాలరాజు గౌడ్ కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు బద్దుల మల్లయ్య యాదవ్ ఎంపీటీసీల సంఘం రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు కావలి శ్రీశైలం తదితరుల నాయకుల ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే శంకర్ ను రైతులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఇందిరా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఎమ్మెల్యే శంకర్ నివాళులు అర్పించారు. అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులకు రెండు లక్షల రుణమాఫీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి రైతులకు ఆర్థిక భరోసా ఇస్తుండడంతో గ్రామ రైతాంగం స్థానిక నాయకుల ఆధ్వర్యంలో ఎమ్మెల్యేకు సన్మానం చేశారు అనంతరం ఎమ్మెల్యే కూడా రైతులకు సన్మానం చేశారు.
పదేళ్లు స్వేచ్ఛ లేకుండా చేశారు
గత పదివేలు టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు అన్ని వర్గాలకు స్వేచ్ఛ లేకుండా చేశారని ఎమ్మెల్యే శంకర్ విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా రైతాంగాన్ని మోసం చేస్తూ వచ్చారని పేర్కొన్నారు. ప్రజలు తమ సమస్యలు చెప్పకుండా ధర్నా చౌక్ ఎత్తివేసి ప్రజా సమస్యలను బయటికి రాకుండా ఎల్లవేళలా అక్రమ నిర్బంధాలు చేశారని గుర్తు చేశారు. గత ప్రభుత్వంలో స్వేచ్ఛ లేదని పోలీసుల ద్వారా గృహనిర్బంధాలు చేసి ఆందోళనలను అణగదొక్కారని ఎమ్మెల్యే శంకర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రజాపాలనతో అన్ని వర్గాలకు స్వేచ్ఛ లభించిందని ఈ సందర్భంగా చెప్పారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చల్లా శ్రీకాంత్ రెడ్డి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బాలరాజు గౌడ్ కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు బద్దుల మల్లయ్య యాదవ్ ఎంపీటీసీల సంఘం రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు కావలి శ్రీశైలం నాయకులు నారం పెంటారెడ్డి నారం రామ్ రెడ్డి ఆర్ల యాదయ్య యాదవ్ చాకలిచంద్రయ్య వెంకటేష్ గౌడ్ బుడ్డ నరసింహులు నారం శ్రీపాదరెడ్డి ఆంజనేయులు గౌడ్ ఎండి యూసుఫ్ నారం కృపాద రెడ్డి నారం దినేష్ రెడ్డి యాదయ్య జంగయ్య ఏంకనోళ్ల రామరాజు చౌడపురం మల్లయ్య ఆర్ల మహేష్, గడ్డమీది శ్రీను బాలరాజ్ కుమార్ పిట్టల బోనయ్య కుమార్ తదితరులు పాల్గొన్నారు..
తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
Posted On 2026-07-05 19:39:21
Readmore >
సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు...
Posted On 2026-07-04 16:57:14
Readmore >