Posted on 2024-07-31 12:49:35
సాయిరాం కన్వెన్షన్ హాల్ పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: షాద్ నగర్ నియోజకవర్గం నందిగామ మండలం అయ్యప్ప టెంపుల్ వద్ద నూతనంగా నిర్మించిన సాయిరాం కన్వెన్షన్ హాల్ ప్రారంభోత్సవ పూజా కార్యక్రమంలో మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాయిరాం కన్వెన్షన్ హాల్ యజమానులు శ్రీకాంత్, ప్రశాంత్ ,ప్రవీణ్ ,గోపాల్ రెడ్డి తదితరులను అభినందించారు. యువత స్వయం ఉపాధి వైపు రాణిస్తూ వ్యాపార రంగాలలో రాటుదేలాలని సూచించారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం సమయం వృధా చేయకుండా మంచి ప్రణాళికలతో యువత వ్యాపార రంగం వైపు మొగ్గు చూపాలని చెప్పారు. సమాజంలో వ్యాపారులకు మంచి గుర్తింపు ఉందని ఎంత లాభసాధిగా ఉంటుందని పేర్కొన్నారు. కన్వెన్షన్ హాల్ ద్వారా సామాన్యులకు కూడా అందుబాటులో సేవలు ఉండే విధంగా చూడాలని కన్వెన్షన్ హాల్ దినదినాభివృద్ధి చెందాలని ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి ఆకాంక్షించారు..
తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
Posted On 2026-07-05 19:39:21
Readmore >
సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు...
Posted On 2026-07-04 16:57:14
Readmore >