డైలీ భారత్, వేములవాడ: సిరిసిల్ల చేనేత కళాకారుడు నల్ల విజయకుమార్ మంగళవారం వేములవాడ రాజన్న ఆలయాన్ని దర్శించి అమ్మవారి కోసం అగ్గిపెట్టెలో ఇమిడే చీరను ఆలయ ఈవో వినోద్ కు అందజేశారు. తాము ప్రతిఏటా అమ్మవారికి అగ్గిపెట్టెలో ఇమిడే చీరను బహుకరిస్తున్నట్టు చెప్పారు.
అనంతరం నేతన్న కుటుంబ సమేతంగా శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకోగా, అర్చకులు వారిని ఆశీర్వదించారు.