Posted on 2024-07-30 20:23:47
ఆగస్టు 1న స్కిల్ యూనివర్సిటీ శంకుస్థాపన చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి
మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జీ మాజీ ఎమ్మెల్యే కేఎల్ఆర్
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: మహేశ్వరం నియోజకవర్గం లో మెడికల్ హబ్, ఎడ్యుకేషన్ హబ్ , రెసిడెన్షియల్ హబ్, ఎంటర్టైన్మెంట్ జాబ్ లు గా సీఎం రేవంత్ రెడ్డి తీర్చిదిచుతున్నారని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కేఎల్ఆర్ మంగళవారం నాడు తుక్కుగూడలో తన క్యాంప్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కందుకూరు మండలం మీర్కాన్ ఖాన్ పేట్ రెవిన్యూ పరిధిలో ఆగస్టు 1తేదిన సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేస్తారన్నారు.ఈ సందర్భంగా కేఎల్ఆర్ మాట్లాడుతూ...ప్రపంచంలోని యూనివర్సిటీల బ్రాంచీలను మహేశ్వరం నియోజకవర్గంలో ప్రారంభిస్తామన్నారు.మహేశ్వరం నియోజకవర్గం మహా నగరంగా మారుతుందన్నారు. మహేశ్వరం నియోజకవర్గానికి మహర్దశ వచ్చిందన్నారు.స్కిల్ డెవలప్మెమెంట్ యూనివర్సిటీకి శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి ఫార్మసిటి వరకు మెట్రో రైలు సౌకర్యం వస్తుందన్నారు. స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీకి ఆదిభట్ల తుక్కుగూడ ఔటర్ రింగురోడ్డు జంక్షన్ల మధ్య నుంచి స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ వరకు ప్రత్యేకంగా రోడ్డు వేస్తామన్నారు.ట్రాఫిక్, పొల్యూషన్ సమస్య లేకుండా ఫార్మసిటిని తీర్చిదిద్దుతామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే జాబ్ క్యాలెండర్ ను ప్రకటిస్తుందన్నారు. ప్రైవేట్ రంగంలో కూడా ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఎక్కువ జీతలు వస్తాయన్నారు.నిరుద్యోగుల కలలను కాంగ్రెస్ పార్టీ సాకారం చేస్తుందన్నారు.స్కిల్ యూనివర్సిటీలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. రైతు రుణమాఫీని రెండో విడత కూడా మాఫీ చేశామన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్నామన్నారు. పంద్రాగస్టు లోపు లక్షల రుణమాఫీని చేసి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు.మహేశ్వరం నియోజకవర్గానికి బహుళ స్థాయి కంపెనీలు తెస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి మహేశ్వరం నియోజకవర్గం ప్రజల తరుపున కేఎల్ఆర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
Posted On 2026-07-05 19:39:21
Readmore >
సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు...
Posted On 2026-07-04 16:57:14
Readmore >