గురువారం 1వ తేదీన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయానికి రాక
భక్తుల సందర్శనకు అవకాశం
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: అయోధ్య రామ మందిరంలో అత్యంత భారీ ఎత్తున ప్రతిష్టించబోతున్న శ్రీరామచంద్రుని విగ్రహానికి సంబంధించి చేతిలో ఉండాల్సిన ధనుర్భాణాలు గురువారం ఉదయం 8 గంటలకు షాద్ నగర్ పట్టణంలోని శ్రీ వాసవి మాత ఆలయానికి రానున్నాయి.
వీటిని అయోధ్య ఆలయానికి అందిస్తున్న దాత చల్లా శ్రీనివాస శాస్త్రి 13 కేజీల వెండి, కేజీ బంగారంతో తయారు చేయించారు. ప్రతిష్టాపనకు ఇంకా సమయం ఉండడంతో ఆయన వీటిని భక్తుల సందర్శనార్థం ప్రముఖ ఆలయాలలో ప్రదర్శన నిమిత్తం తీసుకు వస్తున్నారు.
ఇందులో భాగంగా పట్టణంలోని శ్రీ వాసవి మాత ఆలయానికి ఆగస్టు 1వ తేదీ గురువారం ఉదయం 8 గంటలకు ఆలయానికి తీసుకొస్తారు. మధ్యాహ్నం 1గం. వరకు భక్తుల సందర్శనార్థం దీనిని ఆలయంలో ఉంచుతారు.
స్థానిక భక్తులు పెద్ద ఎత్తున హాజరై ఈ ధనుర్భాణాలను సందర్శించి శ్రీరామచంద్రుని కృపకు పాత్రులు కాగలరని కోరుతున్నాం.