| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఉపాధ్యాయున్ని హత్య చేసిన బార్బర్

ఉపాధ్యాయున్ని హత్య చేసిన బార్బర్

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: హైదరాబాద్ లోని ఎస్సార్ నగర్ లో శనివారం రాత్రి దారుణ హత్య చోటు చేసుకుంది. 

వివరాల ప్రకారం..ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధి లోని హనుమ హాస్టల్‌లో నిన్న రాత్రి మర్డర్ జరిగింది. హెయిర్ కట్ షాప్‌లో పనిచేసే బార్బర్ గణేష్, టీచర్ వెంకటరమణ ఒకే షేరింగ్ రూమ్ లో నివాసం ఉంటున్నారు. 

గణేష్ రోజూ మద్యం సేవిం చి వచ్చి నిద్రకు ఆటంకం కలిగిస్తున్నందుకు ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగి తీవ్ర ఘర్షణ జరిగింది. వెంకటరమణపై గణేష్ కటింగ్ షాప్‌లో ఉపయోగిం చే కత్తితో దాడి చేశాడు. 

దీంతో వెంకటరమణ అక్క డికక్కడే మృతి చెందాడు. ఈ హత్య ఉద్దేశ పూర్వకం గానే చేసినట్టు తెలుస్తుంది,

ప్రేమ వ్యవహారమే హత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడు కర్నూల్‌ జిల్లా ఆలమూరు గ్రామ వాసిగా గుర్తించారు. 

పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Previous వ్యాపారి బరితెగింపు.. మటన్ ముసుగులో కుక్కమాంసం విక్రయాలు?
Next పర్యావరణాన్ని సమతుల్యం చేయడమే కాంగ్రెస్ లక్ష్యం
ADVERTISEMENT