| Daily భారత్
Logo




రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం : ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

News

Posted on 2024-07-27 07:54:01

Share: Share


రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం : ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

ప్రజా ప్రభుత్వాన్ని చూసి జీర్ణించుకోలేకపోతున్న బిఆర్ఎస్ పార్టీ

బడ్జెట్లో వ్యవసారంగానికే పెద్ద పీట

షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావుతో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ గత ప్రభుత్వం నియంతృత్వ పోకడలతో, అనాలోచితం నిర్ణయాలతో రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన బడ్జెట్ ను స్వాగతించకుండా పథకాలకు కోత పెట్టారు అనడం హాస్యాస్పదం అని షాద్ నగర్ ఎమ్మెల్యే  తెలిపారు. కష్టపడి ఒక్కో మెట్టు ఎక్కుతూ సీఎం అయిన రేవంత్ రెడ్డిని చూసి ఓర్వలేక పోతున్నారని, అందుకే ప్రతి పక్ష నేత గా అసెంబ్లీకి రాకుండా ప్రజాస్వామ్య విలువలకు తూట్లు పొడుస్తున్నారని ఆరోపించారు. గత పదేండ్ల రాచరిక పాలన కాలంలో ఉమ్మడి మహబూబ్ నగర్  జిల్లాకు చేసింది శూన్యమని, ఒక్క ఎకరాకు కూడా నీళ్లు అందించలేకపోయారని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కుర్చీ వేసుకొని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, లక్ష్మీదేవి పల్లి ప్రాజెక్టును పూర్తి చేస్తానని హామీ ఇచ్చిన కెసిఆర్ ఆ మాటలను నిలుపుకోలేకపోయారని తెలిపారు. రైతులకు రుణమాఫీ చేసి రైతుల నేస్తం అని నిరూపించిన కాంగ్రెస్ పార్టీ, బడ్జెట్లో వ్యవసాయ రంగానికి దాదాపు 28% కేటాయింపులు చేసి రైతుల పక్షపాతి అని మరోసారి నిరూపించుకుంది. గత ప్రభుత్వం వ్యవసారంగానికి 26,831 కోట్ల రూపాయలను కేటాయిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ బడ్జెట్లో ఏకంగా 71,684 కోట్ల రూపాయలను కేటాయించినందుకు ఎమ్మెల్యే గారు ఆనందం వ్యక్తం చేశారు. ప్రభుత్వం  6,71,751 కోట్ల రూపాయలు అప్పులు చేసి పోయిందని తెలిపారు. అయితే ఈ ఆరు నెలల్లో 42,592 కోట్ల రూపాయలను తిరిగి చెల్లించగలరు గొప్ప విషయమని కొనియాడారు.గత అప్పులను తీర్చడం తో పాటు సంక్షేమాన్ని కూడా మరవకుండా ముందుకు వెళ్ళటం సవాలుతో కూడుకున్న పని కానీ రేవంత్ రెడ్డి నేతృతంలోని ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం స్థాపనే లక్ష్యంగా ముందుకు సాగుతుందని తెలిపారు..

Image 1

మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం

Posted On 2026-07-08 14:21:40

Readmore >
Image 1

సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు

Posted On 2026-07-08 14:18:42

Readmore >
Image 1

వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి

Posted On 2026-07-08 07:55:23

Readmore >
Image 1

ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త

Posted On 2026-07-08 07:13:19

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు

Posted On 2026-07-07 14:17:19

Readmore >
Image 1

పేలుళ్ల కేసులో గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పు

Posted On 2026-07-07 14:05:48

Readmore >
Image 1

ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్‌ ఎక్కించి భర్తను చంపేసిన భార్య

Posted On 2026-07-07 14:04:52

Readmore >
Image 1

ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ

Posted On 2026-07-07 14:03:47

Readmore >
Image 1

ప్రభుత్వ పాఠశాలలకే పిల్లలను పంపిద్దాం

Posted On 2026-07-07 08:21:25

Readmore >
Image 1

ఇంటి వద్దే పాత సోఫాలు, ఫర్నిచర్, పరుపుల సేకరణ

Posted On 2026-07-06 18:24:53

Readmore >