| Daily భారత్
Logo




బిఅర్ఎస్ ముమ్మాటికీ రైతు వ్యతిరేక ప్రభుత్వమే బిజెపి ఫ్లోర్ లీడర్ బోల్గం నాగరాజు గౌడ్

News

Posted on 2023-11-01 12:54:26

Share: Share


బిఅర్ఎస్ ముమ్మాటికీ రైతు  వ్యతిరేక ప్రభుత్వమే బిజెపి ఫ్లోర్ లీడర్ బోల్గం నాగరాజు గౌడ్

డైలీ భారత్ సిరిసిల్ల :బోల్గం నాగరాజు గౌడ్ మాట్లాడుతు ... 

రాష్ట్రంలో ఉన్న రైతు బాంధవులందరికీ నమస్కారం తెలియజేస్తూ.. రైతు ప్రభుత్వం అని చెప్పుకునే టీఆర్ఎస్ ఈరోజు రైతులకు చేసిన మోసాలు ,మీ ముందు ఉంచుతున్నానని పదవ వార్డ్ కౌన్సిలర్ బిజెపి ఫ్లోర్ లీడర్ బొల్గం నాగరాజు గౌడ్ అన్నారు. 2018 లోపు లక్ష రూపాయల రుణం తీసుకున్న రైతులకు రుణమాఫీ చేస్తా అని  హామీ ఇచ్చి, ఇప్పటివరకు పూర్తిగా రుణమాఫీ చేయకుండా రైతులనుటిఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసింది. రుణం రెన్యువల్ చేసే క్రమంలో లక్ష లోపు ఉన్న రుణం ఇంకా మాఫీ కాలేదని త్వరలో అవుతుందని బ్యాంకు అధికారులు చెబుతున్నారు.దీనిపై రైతులు బ్యాంకుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరుగుతున్నారు .అయినా ఇంతవరకు లక్ష రూపాయల రుణమాఫీ చేస్తానని చెప్పిన ప్రభుత్వం తన మాటను నిలబెట్టుకోలేకపోయింది. రైతుబంధు ఇస్తున్నానుఅని చెప్పే  ఈ ప్రభుత్వంవందల ఎకరాలు ఉన్న భూస్వాములకు, చెట్లు పుట్టలకు,పెత్తందారులకురైతుబంధు సొమ్ము అక్రమంగా కట్టబెడుతూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తుంది. నిజంగా రైతు సంక్షేమమే మీ ద్యేయం అయితేఐదు ఎకరాల లోపు ఉన్న చిన్న సన్నకారు కౌలు రైతులకు రైతుబంధు ఇచ్చి మీ చిత్తశుద్ధి చాటుకోండి.ఈ రాష్ట్రంలో మంత్రిగా ఉన్న మల్లారెడ్డి గారేస్వయంగా చెప్పిన మాటలు600 ఎకరాల భూమి ఉందిదీనికి గాను ఆరు లక్షల రూపాయలరైతుబంధు వస్తుందని వారు అన్నారు.ఈ విధంగా పెత్తందారులకు భూస్వాములకు రైతుబంధు పేరిట అక్రమంగా దోచిపెట్టే ప్రయత్నం చేస్తుంది. కేవలం రైతుబంధు ఒకటే ఇచ్చి ఇదివరకు ఉన్న అన్ని సబ్సిడీలు, కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చే పంట నష్టపరిహారం వ్యవసాయ యంత్రాలపై సబ్సిడీ, డ్రిప్పు ఇరిగేషన్ మైక్రో ఇరిగేషన్ వంటి పథకాలకు కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చే ప్రోత్సాహకాలకు గండి కొట్టి కేవలం రైతుబంధు మాత్రమే ఇచ్చి మోసం చేస్తుంది ఈ విషయాన్ని రైతులు గ్రహించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్న. రైతులను ఉద్ధరిస్తామని వారి సంక్షేమం కోసం రైతుబంధు సమన్వయ సమితిలు ఏర్పాటు చేసిన ఈ ప్రభుత్వం ఈరోజు అవి ఎక్కడ ఉన్నాయో ఎవరికి తెలియని పరిస్థితి నెలకొందన్నారు.కేంద్ర ప్రభుత్వ నిధులతో తెలంగాణలో 2601 రైతు వేదిక నిర్మిస్తే ఈరోజు వాటి ఉపయోగం లేకుండా పోయింది.  ఇలా టిఆర్ఎస్ చెప్పేది ఒకటి చేసేది మరొకటి..... తెలంగాణ వచ్చి తొమ్మిది సంవత్సరాలు గడుస్తున్న ఇంతవరకు మన బతుకులు బాగుపడలేదు, మన చదువుకున్న బిడ్డలు నిరుద్యోగులుగానే ఉన్నారు ఎన్నో ఆశలు చూపి అందలమెక్కిన ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం సబ్బండ వర్గాలను మోసం చేసింది కాబట్టి ఈ రాబోయే ఎన్నికల్లో రైతులు ఇతర వర్గాలకు చెందిన ప్రజలందరూ టిఆర్ఎస్కు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. రైతు వ్యతిరేక ప్రభుత్వాన్ని గద్దె దింపి తెలంగాణలో బిజెపి నాయకత్వంలో గల రైతు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా రైతులకు పిలుపునిచ్చారు.

Image 1

సాయి ఎక్సలెంట్ పాఠశాలలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

Posted On 2026-08-15 16:56:59

Readmore >
Image 1

విద్యుత్ షాక్ తో మరణించిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మృతికి కారణమైన నిందితులను అరెస్టు చేసిన బూర్గంపాడు పోలీసులు

Posted On 2026-08-15 16:55:47

Readmore >
Image 1

మూడు ప్రాంతాల్లో ఫ్రీజర్‌ బాక్సుల పంపిణీ

Posted On 2026-08-15 16:54:31

Readmore >
Image 1

స్వాతంత్ర్య స్ఫూర్తితో దేశాభివృద్ధికి కృషి చేయాలి

Posted On 2026-08-15 16:53:32

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా : జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

Posted On 2026-08-15 13:43:20

Readmore >
Image 1

వెంకట సాయి నగర్ కాలనీలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

Posted On 2026-08-15 07:51:52

Readmore >
Image 1

ఆటో కార్మికులతో కలిసి స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న బిజెపి నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-08-15 07:33:17

Readmore >
Image 1

డీఐజీలమంటూ ఫేక్ ఐడీలు... భార్యాభర్తల లక్షల మోసం...

Posted On 2026-08-15 06:37:39

Readmore >
Image 1

భూ వివాదం నేపథ్యంలో వ్యక్తిపై పారతో దాడి.. ఇద్దరు అరెస్ట్

Posted On 2026-08-15 03:41:51

Readmore >
Image 1

"బెస్ట్ సైకాలజిస్ట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్న పున్నంచందర్"

Posted On 2026-08-14 18:18:19

Readmore >