Posted on 2024-07-20 14:59:32
ముత్తారంలో ఇంట్లో చంపి గొనసంచిలో మూటకట్టి బావిలో వేశారు
హత్యలో పాల్గొన్న ముగ్గురు అరెస్ట్
డైలీ భారత్ రంగారెడ్డి జిల్లా: పెద్దపల్లి జిల్లా ముత్తారం మండల కేంద్రంలో గత నెల 8వ తేదీన బావిలో మూటలో దొరికిన మహిళ అప్పు అడిగినందుకే మహిళను హత్య చేశారని గోదావరిఖని ఏసీపీ మడత రమేష్ తెలిపారు. మంథని పోలీస్ స్టేషన్ లో శనివారం సమావేశంలో మంథని సీఐ వెంకటేశ్వర్లు, ముత్తారం ఎస్ఐ మధుసూధన్ రావులతో కలిసి నిందితుల వివరాలను తెలిపారు. ఈ నెల 5వ తేదీన ముత్తారంకు చెందిన అమ్ము రజీత అలియస్ లావాణ్య తన ఇంటి సమీపంలో ని పెరక రాజేశ్వరి (65) వద్ద అప్పు లక్ష 50 వేలు అప్పు తీసుకుందని, రాజేశ్వరి తరుచూ అప్పుడబ్బులు ఇవ్వమని అడిగినందుకు ఆగ్రహంతో 8వ తేదీన అప్పు ఇస్తానని రాజేశ్వరిని ఇంటికి పిలిచిన లావణ్య మరో వ్యక్తి కుక్కముడి తిరుపతితో పాటు భర్త రవి అలియాస్ రమేష్ తో కలిసి ఇంట్లో గొంతు నులిమి చంపి అదే రాత్రి గొనసంచిలో మూటకట్టి బావిలో పారుపల్లికి వేళ్లే వ్యవసాయ బావిలో వేశారన్నారు. హత్యలో పాల్గొన్న ముగ్గురిని శనివారం ఉదయం సీఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ మధుసూధన్ రావు లు అరెస్ట్ చేశారని తెలిపారు. అప్పు ఇచ్చిన రాజేశ్వరి తమను తరచుగా డబ్బులు ఇవ్వాలని ఇబ్బందులు పెట్టేదని, అందుకే ఆమెను హత్య చేసి రాజేశ్వరి ఒంటి పై ఉన్న బంగారం తీసుకున్నట్లు ఏసీపీ తెలిపారు. నిందుతులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పర్చమన్నారు. హత్య చేసిన నిందితులను చాకచక్యంగా పట్టుకున్న సీఐ, ఎస్ఐ లతో పాటు కానిస్టేబుల్స్ దుబాసి రమేష్, బాలగాని కిరణ్ లను ఏసీపీ అభినందించారు.
జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం
Posted On 2026-09-01 17:18:53
Readmore >
రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు
Posted On 2026-09-01 16:34:15
Readmore >
జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి
Posted On 2026-09-01 16:30:44
Readmore >
కొండగట్టు నుండి వస్తున్న భక్తుల కారు బోల్తా... ఎయిర్‌బ్యాగ్‌లతో తప్పిన ముప్పు
Posted On 2026-09-01 15:32:20
Readmore >
సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు
Posted On 2026-09-01 11:18:42
Readmore >
ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-09-01 09:34:38
Readmore >
సెప్టెంబర్ 17 డెడ్ లైన్... ఉద్యమకారుల హామీలు నెరవేర్చకుంటే రాష్ట్రవ్యాప్త ఉద్యమం : JAC చైర్మన్ గజ్జెల దేవరాజు హెచ్చరిక
Posted On 2026-09-01 08:21:35
Readmore >