Posted on 2024-07-16 06:14:31
డైలీ భారత్, నిజామాబాద్ : బంధువులు తమపై దుష్ప్రచారం చేస్తున్నారని మనస్తాపం చెందిన దంపతులు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు.
అంతకుముందు తమ ఆవేదన తెలియజేస్తూ వీడియో తీసి పోలీసులకు పంపించారు. వారిని కాపాడేందుకు పోలీసులు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం ఫకీరాబాద్-మిట్టాపూర్ మధ్యలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు, గ్రామస్థుల కథనం ప్రకారం..
పొతంగల్ మండలం హెగ్డోలికి చెందిన అనిల్ (28), పొతంగల్‌కు చెందిన శైలజ (24)కు ఏడాది కిందట వివాహమైంది. వారిద్దరూ ఓ ఇంటర్వ్యూకు వెళ్తున్నట్లు కుటుంబీకులకు చెప్పి సోమవారం బయటకు వచ్చారు. అనంతరం తాను ఓ తప్పు చేశానని, దాన్ని భర్త క్షమించినా బంధువులు తమపై దుష్ప్రచారం చేస్తుండడాన్ని తట్టుకోలేక ఇద్దరం గోదావరిలో దూకి ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు శైలజ వీడియో చిత్రీకరించి కోటగిరి ఎస్సై సందీప్‌కు పంపారు. ఆయన నవీపేట ఎస్సై యాదగిరిగౌడ్‌కు వీడియోతోపాటు వారి సెల్‌ఫోన్ నంబరు పంపారు. దంపతులు ఆత్మహత్య చేసుకునేందుకు గోదావరి వద్దకు వస్తున్నట్లు సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు బాసర వంతెన దగ్గరకు వెళ్లి గాలించగా కనిపించలేదు. బాధితుల ఫోన్ నంబరును ట్రాక్ చేయగా ఫకీరాబాద్-మిట్టాపూర్ మధ్య ఉన్నట్లు నవీపేట ఎస్సై గుర్తించి అక్కడికి వెళ్లి గాలించగా ఇద్దరి మృతదేహాలు పట్టాలపై కనిపించాయి. రైల్వే పోలీసులకు సమాచారం అందించినట్లు ఎస్సై చెప్పారు.
జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం
Posted On 2026-09-01 17:18:53
Readmore >
రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు
Posted On 2026-09-01 16:34:15
Readmore >
జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి
Posted On 2026-09-01 16:30:44
Readmore >
కొండగట్టు నుండి వస్తున్న భక్తుల కారు బోల్తా... ఎయిర్‌బ్యాగ్‌లతో తప్పిన ముప్పు
Posted On 2026-09-01 15:32:20
Readmore >
సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు
Posted On 2026-09-01 11:18:42
Readmore >
ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-09-01 09:34:38
Readmore >