Posted on 2024-07-12 07:45:38
డైలీ భారత్, హైదరాబాద్: భాగ్యనగరంలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. నాంపల్లి రైల్వే స్టేషన్ దగ్గర గురువారం అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. రైల్వేస్టేషన్ దగ్గర ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతుండగా వారిని పోలీసులు ప్రశ్నించారు. సమాధానం చెప్పని ఆ ముగ్గురు దుండగులు క్షణాల్లోనే పోలీసులపై మెరుపు దాడికి యత్నించి పారిపోవాలని చూశారు.
కాల్పులు ఎందుకు..?
ఒకరు గొడ్డలితో.. మరో ఇద్దరు రాళ్లతో పోలీసులపై దాడికి యత్నించారు. ఈ క్రమంలోనే పోలీసులు కాల్పులు జరిపి దుండగులను పట్టుకున్నారు. ఈ కాల్పులతో హైదరాబాద్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది..!. కాగా.. పట్టుబడ్డ వారిలో అనీస్ రాజ్‌తో పాటు మరో ఇద్దరు నిందితులున్నారు. పోలీసుల కాల్పుల్లో ఒకరికి గాయాలవ్వగా.. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆ ముగ్గురినీ దోపిడీ దొంగల ముఠాగా పోలీస్ డెకాయ్ టీమ్ అనుమానిస్తోంది.
మేమున్నాం..!
ఇదిలా ఉంటే.. ఇటీవలే హైదరాబాద్ శివారులో దోపిడీ దొంగలను పట్టుకునే క్రమంలో పోలీసులు కాల్పులు జరపాల్సి వచ్చింది. ఇప్పుడు నాంపల్లి స్టేషన్ దగ్గర మరోసారి కాల్పులు జరిగాయి. ఈ వరుస ఘటనలతో హైదరాబాద్ ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్న పరిస్థితి. అయితే.. శాంతి భద్రతలు, రక్షణ విషయంలో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని.. నగరవాసులు ప్రశాంతంగా ఉండొచ్చని పోలీసులు అభయమిస్తున్నారు..
#nampally railway station
ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీలో రచ్చ...అధికారిపై చర్యలు తీసుకోవాలంటున్న బూర బాలమల్లు
Posted On 2026-09-04 03:56:31
Readmore >
ఢిల్లీ షాకింగ్ ఘటన... యువతి పొట్టలోంచి 1.16 కిలోల వెంట్రుకల ముద్ద తొలగింపు!
Posted On 2026-09-03 09:31:35
Readmore >
ఎల్లారెడ్డిపేటలో యూరియా కోసం రైతుల అవస్థలు... PACS ఎదుట భారీ ధర్నా
Posted On 2026-09-03 09:21:29
Readmore >
భార్య మృతితో మనస్తాపం... చెట్టుకు ఉరేసుకుని వృద్ధుడి ఆత్మహత్య
Posted On 2026-09-03 07:53:15
Readmore >
జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం
Posted On 2026-09-01 17:18:53
Readmore >
రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు
Posted On 2026-09-01 16:34:15
Readmore >
జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి
Posted On 2026-09-01 16:30:44
Readmore >