Posted on 2024-07-11 11:51:27
షాద్ నగర్ శివారులో రియల్ వ్యాపారి దారుణహత్య ఉదంతం
హత్యకు ప్రధాన సూత్రధారి బాబా వెనుక ఉన్నది ఎవరు..?
ఆస్తుల విషయంలో కుటుంబ సభ్యుల పాత్ర పై పోలిసుల అనుమానం
అన్ని వివాదాస్పద భూములే రియల్టర్ కేకే వ్యాపారం
కబ్జాలు.. దౌర్జన్యం అతని నైజం
కబ్జా చేసిన స్థలాల్లో ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తుల నివాసం
పోలీసుల అదుపులోనే బాబా..?
భూమి వ్యవహారాల్లో ఇతరులను వాడుకోని వదిలేసే వైనం
పదిహేను రోజుల క్రితమే మళ్లీ విధుల్లో చేరిన బాడీగార్డ్ బాబా
మొదటి నుండి వ్యాపారంలో "కేకే"ది క్రిమినల్ బుర్ర
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: నమ్మిన వాళ్లు వెంట సోపతి చేసిన వాళ్లే రియాల్టర్ కేకేను హతమార్చేందుకు పక్కా స్కెచ్ వేశారు. ఆది నుండి అంతం వరకు రియాల్టర్ కుమ్మరి కృష్ణ ఉదంతం వివాదాస్పదమే..! వ్యాపార లావాదేవీల విషయంలో తన మన తేడా లేకుండా క్రిమినల్ బుర్రలు ఉపయోగించేవాడని అతనితో దగ్గరగా వ్యాపారం చేసిన వాళ్ళు చెబుతున్నారు.
దాదాపు పదివేల కోట్ల రూపాయల ఆస్తులను కూడగట్టిన కుమ్మరి కృష్ణ జంట నగరాల్లో కేకే కన్వెన్షన్ ద్వారా అందరికీ సుపరిచితుడు. రియల్ రంగంలో బాగా అందెవేసిన చెయ్యి. నిన్న షాద్ నగర్ పట్టణ శివారులోని కమ్మదనం గ్రామంలో ఉన్న కేకే ఫామ్ హౌస్ లో తన అంగరక్షకుడు గా ఉన్న బాబా చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు. ఇంట బయట అనేక వివాదాలు చుట్టుముట్టిన నేపథ్యంలో కేకే
హత్య ఇప్పుడు రియల్ వ్యాపారంగంలో సంచలనం రేపుతుంది. భూ కబ్జాలు, దౌర్జన్యం, తెలివితేటలు ప్రదర్శిస్తూ సామాన్యుల భూములను తీసుకొని వారిని ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాపే నైజం ఉన్న రియల్టర్ కేకేను పగ ప్రతికాలంతో చంపి ఉండొచ్చని అతనితో దగ్గరగా వ్యాపారం చేసిన వారు కొందరు అంటుండగా, మరికొందరు కుటుంబ తగాదాల వల్లే బాబాతో హత్య చేసి ఉంటారని మరికొందరు అంటున్నారు. నిన్న జరిగిన హత్య అవుదాం తర్వాత నిందితులు పోలీసులకు లొంగిపోయినట్టు విశ్వసనీయ సమాచారం. రియాల్టర్ కేకే వ్యవహారంలో మరిన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూసే అవకాశాలు లేకపోలేదు. కేకేకు బహు భార్యత్వ సమస్యలు కూడా ఉన్నాయి. ఆయనకు ముగ్గురు భార్యలని ఒకరు మృతిచెందగా మరో ఇద్దరు తో ఉంటున్నారని చెబుతున్నారు. రియాల్టర్ కేకే వద్ద గతంలో సుదీర్ఘకాలం పనిచేసిన బాబా కెకె చెప్పిన అనేక పనులు చేశాడని తెలుస్తుంది. అనేక కేసుల్లో ఆక్రమణల్లో వీరి భాగస్వామ్యం ఉన్నట్టు సమాచారం. అయితే కేకే ఇటీవల కాలంలో బాబాలు పనిలోని తీసేశారు. 15 రోజుల క్రితం కాళ్ళ వేలపడి బాబా మళ్లీ కేకే వద్ద పని కుదుర్చుచుకున్నాడు. వచ్చిన కొద్ది రోజుల్లోనే నమ్మకం గా నటించి చివరకు కేకేను కడతేరించాడు. అంటే ఈ ఉధంతంలో బాబా ఉద్దేశపూర్వకంగా అతని వెనుక ఎవరో ఉంటూ ఈ పని చేయించారని క్లియర్ కట్ గా అర్థమవుతుంది. బాబా వెనుక ఉన్నది ఎవరు కుటుంబ సభ్యుల పాత్ర ఏంటి బయట భూతగాదాల వల్ల ఏర్పడ్డ శత్రువుల పరిస్థితి ఏంటి అన్న కోణంలో పోలీసులు ముమ్మర దర్యాప్తు చేపట్టారు. స్థానిక ఏసిపి ఎన్సీ రంగస్వామి నేతృత్వంలో దర్యాప్తు బృందాలు పరిశోధన చేపట్టాయి.
నమ్మినవాడే నయవంచకుడయ్యాడు..
సహాయకుడిగా ఉంటూనే యజమాని ప్రాణం తీశాడు బాబా. షాద్ నగర్ పరిధిలో జరిగిన ఘటన పూర్తి వివరాలివీ.. గండిపేట మండలం హైదర్ షా కోట్ కు చెందిన కమ్మరి కృష్ణ (55) రియల్ ఎస్టేట్ వ్యాపారి. కమ్మదనంలో ఫాంహౌస్ ఉంది. బుధ వారం కృష్ణ మూడో భార్య పావనితో కలిసి అక్కడికి వెళ్లాడు. అదను కోసం చూస్తున్న కృష్ణ వ్యక్తిగత సహాయకుడైన బాబాతోపాటు మరో ఇద్దరు కత్తితో కృష్ణ గొంతుకోసి పరారయ్యారు. అతని అరుపులు విని పైఅంతస్తులో ఉన్న భార్యవచ్చి కృష్ణను శంషాబాద్లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అప్ప టికే చనిపోయాడు. కృష్ణ దగ్గర బాబా వ్యక్తిగత సహాయకుడిగా కొన్నే ళ్లుగా పనిచేస్తుండగా ఏడాది క్రితం అతడిని తొలగించారు. సరిగా పనిచేస్తానంటూ కృష్ణను బతిమాలడంతో 15 రోజుల క్రితమే విధుల్లోకి తీసుకున్నారని మరో భార్య పావని చెప్పారు.
మృతుడు కృష్ణ బాబా వెనుక ఎవరు?
కృష్ణకు వేల కోట్లకుపైగా ఆస్తులున్నాయని, కొన్ని వివాదాస్పదమైనవని, నగరంలో ఇతనిపై భూ ఆక్రమణ కేసులున్నట్లు, మాజీ రౌడీషీటర్ అని తెలిసింది. ఇతని మొదటి భార్యకు ఇద్దరు కొడుకులున్నారు. మూడో భార్య సంతానం మొదటి పుట్టినరోజు వేడుకలు 4 నెలల క్రితం నగరంలో చేశాడు. హత్యలో కుటుంబ సభ్యుల హస్తం కూడా ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులు లొంగిపోయినట్లు సమాచారం అందుతుంది.
బుధవారం బాబాతోపాటు మరో వ్యక్తిగత సహాయకుడిని కృష్ణ షాద్ నగర్ సమీపంలోని మరో వ్యవసాయ క్షేత్రానికి పంపించినట్లు తెలిసింది. కృష్ణ ఫాంహౌసు వెళ్లిన విషయం తెలుసుకున్న బాబా ఫోన్ ఛార్జింగ్ పెట్టాలని అక్కడికి వచ్చాడు. కొంతసేపటికి మరో ఇద్దరు వచ్చారు. ఇద్దరు కృష్ణ కాళ్లు చేతులు పట్టుకోగా మరొకరు గొంతు కోసి హత మార్చారు. నిందితుల్లో ఇద్దరు కారులో దగ్గరలోని బంకులో పెట్రోల్ పోయించుకొన్నారు.
కమ్మదనంలో కబ్జా బాగోతం..
కమ్మదనంలో తన ఫామ్ హౌస్ సమీపంలో మరో 18 ఎకరాల్లో రియల్ వ్యాపారి కమ్మరి కృష్ణ కబ్జా పెట్టినట్టు సమాచారం అందుతుంది. భూముల వ్యాపారంలో మొదట నమ్మించి మచ్చిక చేసుకున్న తర్వాత ఏదో రకంగా భూములను కైవసం చేసుకునేందుకు నానారకాలుగా కృష్ణ యాగి చేస్తాడని మార్కెట్లో ఇతనిపై విమర్శలు ఉన్నాయి. నమ్మించి భూములు ఇచ్చిన వారికి కూడా సరిగ్గా డబ్బులు చెల్లించే రకం కాదని, పైసల కోసం మొండికేసేవాడని చెబుతున్నారు. చాలామందికి కమిషన్లు కూడా ఎగ్గొట్టినట్టు సమాచారం ఉంది. అసలు కృష్ణ వ్యాపారం భూముల కొనుగోలు ఒక శైలి అనుసరిస్తూ ఉంటాడు. కృష్ణ వివాదాస్పద భూముల తప్ప ఇతర భూములు కొనుక్కోడు. వివాదాస్పద భూములు అడుగుపెట్టడం వాటిలో ఉన్న చిక్కులను పరిష్కరించి ఆ భూమిని అతి తక్కువకు తీసుకొని మార్కెట్లో ఎక్కువ ధరకు విక్రయిస్తూ వ్యాపారం చేస్తూ ఉంటాడు. హైదరాబాద్ నగరంలో కూడా ఎన్నో విలువైన భూములు ఆస్తులు ఇతని సొంతం అయ్యాయి. గతంలో ఓ హత్య కేసులో కూడా ఇతని ప్రమేయం ఉన్నట్టు సమాచారం. సొంత ఇంటి నుండి మొదలుకొని బయట మార్కెట్ లో అందరితో ఏదోరకంగా కమ్మరి కృష్ణ వివాదాస్పదంగానే ఉంటున్నాడు. తన వద్ద పనిచేసే అంగరక్షకుడు బాబా విషయంలో కూడా గతంలో అనేక పనులు అతనితో చేయించుకుని చివరకు అతన్ని కూడా ఉద్యోగం నుండి తొలగించాడని, ఇతని మాటలు నమ్మి కొన్ని కేసుల్లో జైలుకు వెళ్లినా కూడా పెద్దగా పట్టించుకోలేదని బాబాలో ఉన్న కసిని చూసి కృష్ణకు వ్యతిరేక వర్గం వారు ఈ పని కూడా చేసి ఉండవచ్చని అనుమానాలు బలపడుతున్నాయి. అయితే అది కుటుంబ నేపథ్యంలో జరిగిందా? లేక భూవివాదాల నేపథ్యంలో జరిగిందా? అన్న విషయంలో పోలీసులు స్పష్టత ఇవ్వాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికీ రియల్ ఎస్టేట్ వ్యాపారి కేకే హత్య సంచలనంలా ఈ ప్రాంతంలో దావణంలా వ్యాపించింది..
అబుదాబి విమానాశ్రయం సమీపంలో జరిగిన దాడిలో తెలంగాణ వ్యక్తి గాయపడ్డాడు
Posted On 2026-03-05 06:04:46
Readmore >
సైన్య సేన ఆధ్వర్యంలో ఉగాది పండుగ సందర్భంగా వృద్ధులకు దుస్తులు పంపిణీ
Posted On 2026-03-04 23:23:12
Readmore >
స్త్రీ తలచుకుంటే సాధ్యం కానిది ఏదీ ఉండదని నిరూపించిన నాగ్‌పూర్‌కు చెందిన దీపాలి ఖోబ్రగడె
Posted On 2026-03-04 21:01:53
Readmore >
మున్సిపల్ కమిషనర్ సునీత రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు వెల్లువ
Posted On 2026-03-04 20:00:46
Readmore >
మస్జీద్ కాంప్లెక్స్‌లోని షాప్ నెంబర్ 5 కేటాయింపును వెంటనే రద్దు చేయాలి
Posted On 2026-03-04 18:30:50
Readmore >
కెన్నెడీ పాఠశాలలో ఘనంగా ఫేర్వెల్ పార్టీ... అభినందించిన పలువురు
Posted On 2026-03-04 16:19:10
Readmore >
38వ వార్డులో దొంగ ఓట్లపై విచారణ జరపాలి... రీపోలింగ్‌కు డిమాండ్
Posted On 2026-03-04 16:16:19
Readmore >
రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. 3 నెలల బియ్యం ఒకేసారి పంపిణీ
Posted On 2026-03-04 15:50:03
Readmore >