| Daily భారత్
Logo




మీరిచ్చిన గెలుపు నా గుండెల్లో పెట్టుకుంటా : షాద్ నగర్ లో బిజేపి కృతజ్ఞత సభ

News

Posted on 2024-07-11 08:19:08

Share: Share


మీరిచ్చిన గెలుపు నా గుండెల్లో పెట్టుకుంటా : షాద్ నగర్ లో బిజేపి కృతజ్ఞత సభ

షాద్ నగర్ ప్రజలకు పాదాభివందనాలు

మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యురాలు డీకే అరుణ

షాద్ నగర్ లో బిజేపి కృతజ్ఞత సభ

పట్టణంలో భారీ విజయోత్సవ ర్యాలీ

డైలీ భారత్ రంగారెడ్డి జిల్లా: పాలమూరు ప్రజలు, షాద్ నగర్ నియోజకవర్గం పార్టీ కార్యకర్తలు అభిమానులు అన్ని వర్గాలు అందించిన విజయాన్ని నా గుండెల్లో పెట్టుకుంటానని ఈ విజయాన్ని ప్రజలకు అంకితం ఇస్తున్నానని మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యురాలు డీకే అరుణ అన్నారు. బుధవారం షాద్ నగర్ పట్టణంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో భారీ విజయోత్సవ ర్యాలీతోపాటు స్థానిక కుంట రామిరెడ్డి గార్డెన్ లో కృతజ్ఞత సభను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయా కుల సంఘాలు ఇతర వర్గాలను డీకే అరుణ ఘనంగా సన్మానించారు. తన గెలుపు కారణమైన అన్ని వర్గాలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా అభిమానులు డీకే అరుణను ఘనంగా సత్కరించారు. అనంతరం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో డీకే అరుణ మాట్లాడుతూ.. పార్లమెంటు ఎన్నికల్లో తనను ఓడించడానికి సాక్షాత్తు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శతవిధాల ప్రయత్నం చేశారని ఎన్నో బెదిరింపులు మరెన్నో అవమానాలు చేశారని అయినప్పటికీ పాలమూరు ప్రజలు తన వెంట ఉన్నారని అన్నారు. తన ఓటమి కోసం రేవంత్ రెడ్డి తదితరులు ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజలు తన వెన్నంటే ఉన్నారని ఆమె అన్నారు. పాలమూరు జిల్లా సమీక్ష సమావేశంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా అభివృద్ధికి తీసుకున్న నిర్ణయాలలో అన్నింటిని బిజెపి తరఫున లేవనెత్తిన అంశాలేనని ఇప్పుడు తన పోరాటం ద్వారా జిల్లా సర్వతో ముఖాభివృద్ధి చెందుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ మాటలు ప్రజలు విశ్వసించలేదని కేంద్రంలో మోడీని పాలమూరులో డీకే అరుణమ్మను గుండెల్లో పెట్టుకొని అభిమానించారని ఓట్లు వేశారని అందుకే బిజెపి విజయం సాధ్యమైందని ప్రజలకు శిరస్సు వంచి పాదాభివందనం అంటూ ఉద్వేగంగా మాట్లాడారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ద్వారా మహబూబ్ నగర్, షాద్ నగర్ ప్రాంతాలకు నీరు అందే దాఖలాలు కనిపించడం లేదని అందుకే జూరాల ద్వారా నిరందించే అందించే మరో లిఫ్ట్ ఇరిగేషన్ సిద్ధం చేయాలని ప్రభుత్వాన్ని ఆమె డిమాండ్ చేశారు. లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్ నిర్మాణానికి తనవంతు కృషి చేస్తానని ఆమె భరోసా ఇచ్చారు. బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నెల్లి శ్రీ వర్ధన్ రెడ్డి మాట్లాడుతూ రాహుల్ గాంధీ హిందూ విద్వేషియని అన్నారు. పార్లమెంటులో ప్రమాణ స్వీకారం చేసి హిందువులపై అక్కసు వెళ్లగక్కారని అన్నారు. అదేవిధంగా మరో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీ నాయకుల మాదిరిగా ఏ కంపెనీ వద్ద వసూళ్లకు పాల్పడడం లేదని నియోజకవర్గంలో ఒక పార్లమెంటు సభ్యురాలుగా మాకు అండగా నిలబడి యువతకు ఉపాధి మార్గాలు చూపించాలని పేర్కొన్నారు. 

కార్యవర్గ సభ్యుడు అందే బాబయ్య మాట్లాడుతూ పార్లమెంటు ఎన్నికల్లో సాధించిన విజయంతో స్థానిక ఎన్నికల్లో బిజెపి కార్యకర్తల గెలుపు కోసం డీకే అరుణమ్మ కృషి చేయాలని సభలో కోరారు. రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బొక్కా నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. అపూర్వ విజయం సాధించి పెట్టిన ఓటర్లకు బిజెపి పార్టీ తరఫున రంగారెడ్డి జిల్లా ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా అన్ని వర్గాలను డీకే అరుణ సత్కరించగా ఆమెను పలువురు నాయకులు ఘనంగా సత్కరించారు. పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి తదితర అభిమానులు డీకే అరుణ చిత్రపటాన్ని బహుమానంగా అందజేశారు..

Image 1

ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీలో రచ్చ...అధికారిపై చర్యలు తీసుకోవాలంటున్న బూర బాలమల్లు

Posted On 2026-09-04 03:56:31

Readmore >
Image 1

ఢిల్లీ షాకింగ్ ఘటన... యువతి పొట్టలోంచి 1.16 కిలోల వెంట్రుకల ముద్ద తొలగింపు!

Posted On 2026-09-03 09:31:35

Readmore >
Image 1

ఎల్లారెడ్డిపేటలో యూరియా కోసం రైతుల అవస్థలు... PACS ఎదుట భారీ ధర్నా

Posted On 2026-09-03 09:21:29

Readmore >
Image 1

భార్య మృతితో మనస్తాపం... చెట్టుకు ఉరేసుకుని వృద్ధుడి ఆత్మహత్య

Posted On 2026-09-03 07:53:15

Readmore >
Image 1

ఎసిబి కి చిక్కిన SI

Posted On 2026-09-02 05:22:18

Readmore >
Image 1

జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం

Posted On 2026-09-01 17:18:53

Readmore >
Image 1

సమాజం గర్వించేలా పిల్లల్ని తీర్చిదిద్దుతాం

Posted On 2026-09-01 17:17:22

Readmore >
Image 1

రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు

Posted On 2026-09-01 16:34:15

Readmore >
Image 1

జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి

Posted On 2026-09-01 16:30:44

Readmore >
Image 1

ఆటో డ్రైవర్లు బాధ్యతగా వాహనాలు నడపాలి

Posted On 2026-09-01 16:29:17

Readmore >