| Daily భారత్
Logo




అక్షరం నేర్పిన బడికి అరుణోదయ ప్రగతి..

News

Posted on 2024-07-10 15:47:27

Share: Share


అక్షరం నేర్పిన బడికి అరుణోదయ ప్రగతి..

వట్టెం నవోదయ పాఠశాలకు యువనేత మురళీకృష్ణ యాదవ్ సేవలు..

తన సోదరి జ్యోతి స్మారకార్థం స్వాగత తోరణం..

డైలీ భారత్ రంగారెడ్డి జిల్లా: అది తనను అక్కున చేర్చుకొని అక్షరం నేర్పిన బడి.. తన మేధస్సు పెంచిన అమ్మ ఒడి.. విద్యా ప్రగతి వైపు తనను నడిపించిన గుడి.. అలాంటి బడికి ఏదైనా చేయాలనే సంకల్పంతో ముందడుగు వేసి తన ఔదార్యాన్ని చాటుకున్నారు షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ కుమారుడు, బీఆర్ఎస్ యువనేత మురళీకృష్ణ యాదవ్. నాగర్ కర్నూల్ జిల్లా పరిధిలోని పాలెం పరిధిలోగల వట్టెం నవోదయ పాఠశాలలో రూ. 10 లక్షలు వెచ్చించి స్వాగత తోరణాన్ని నిర్మించారు. తమ సోదరి జ్యోతి జ్ఞాపకార్థం ఈ సత్కార్యానికి ఆయన శ్రీకారం పెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు అక్షరాలు నేర్పిన పాఠశాలకు భవిష్యత్తులోనూ మరిన్ని సేవలు అందిస్తానని ఈ సందర్భంగా వెల్లడించారు. విద్యార్థుల శ్రేయస్సు లక్ష్యంగా గతంలోనూ పలు సేవలు అందించారు యువనేత మురళీ యాదవ్. షాద్ నగర్ పరిధిలో పోటీ పరీక్షలు రాసే విద్యార్థుల కోసం ఉచిత కోచింగ్ తరగతులు ఏర్పాటు చేయడం తో పాటు పలు పాఠశాలల్లో సదుపాయాల కల్పనకు ఆర్థికంగా సహకరించారు. ఇలాంటి లాభాపేక్ష లేకుండా లక్షల రూపాయలు వెచ్చించి ఆయన సేవా కార్యక్రమాలు నిర్వహించడం సర్వత్ర ప్రశంసలు అందుకుంటుంది..

Image 1

ఎల్లారెడ్డిపేటలో బీఆర్ఎస్ నేతల వినూత్న నిరసన... కేసు నమోదు చేసిన పోలీసులు

Posted On 2026-09-04 08:53:55

Readmore >
Image 1

ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీలో రచ్చ...అధికారిపై చర్యలు తీసుకోవాలంటున్న బూర బాలమల్లు

Posted On 2026-09-04 03:56:31

Readmore >
Image 1

ఢిల్లీ షాకింగ్ ఘటన... యువతి పొట్టలోంచి 1.16 కిలోల వెంట్రుకల ముద్ద తొలగింపు!

Posted On 2026-09-03 09:31:35

Readmore >
Image 1

ఎల్లారెడ్డిపేటలో యూరియా కోసం రైతుల అవస్థలు... PACS ఎదుట భారీ ధర్నా

Posted On 2026-09-03 09:21:29

Readmore >
Image 1

భార్య మృతితో మనస్తాపం... చెట్టుకు ఉరేసుకుని వృద్ధుడి ఆత్మహత్య

Posted On 2026-09-03 07:53:15

Readmore >
Image 1

ఎసిబి కి చిక్కిన SI

Posted On 2026-09-02 05:22:18

Readmore >
Image 1

జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం

Posted On 2026-09-01 17:18:53

Readmore >
Image 1

సమాజం గర్వించేలా పిల్లల్ని తీర్చిదిద్దుతాం

Posted On 2026-09-01 17:17:22

Readmore >
Image 1

రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు

Posted On 2026-09-01 16:34:15

Readmore >
Image 1

జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి

Posted On 2026-09-01 16:30:44

Readmore >