| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

150 ఏండ్ల తర్వాత నల్లమలలో కనిపించిన అడవి దున్న

150 ఏండ్ల తర్వాత నల్లమలలో కనిపించిన అడవి దున్న

డైలీ భారత్ రంగారెడ్డి జిల్లా ప్రతినిథి:నల్లమల అడవుల్లో 150 ఏళ్ల నుంచి కనిపించని అడవి దున్న ఇప్పుడు మళ్లీ మంగళవారం సాయంత్రం కనిపించింది. నెల రోజుల క్రితం ఆత్మకూరు అటవీ డివిజన్ పరిధిలో దీన్ని గుర్తించారు అటవీ అధికారులు..

వెంటనే వీడియో, ఫొటోలు తీసిన సిబ్బంది విషయాన్ని ఉన్నతాధికారుల వద్దకు తీసుకెళ్లారు. తాజాగా మళ్లీ వెలుగోడు రేంజ్ లో నిన్న సాయంత్రం అడవిదున్న కనిపించింది. 

నాగార్జున సాగర్, శ్రీశైలం పులుల అభయారణ్యం ఆత్మకూరు రేంజ్ డిప్యూటీ డైరెక్టర్ సాయిబాబా మాట్లాడుతూ..ఇన్నేళ్ల తర్వాత అడవిదున్న కనిపించడం ఆశ్చర్యం కలిగించే విషయం అన్నారు. 

పెద్దపులులు, ఏనుగులు వంటి భారీ జంతువుల సుదూర ప్రాంతాలకు తరలి వెళ్లడం సాధారణమే కానీ ఈ అడవి దున్న మైదానా న్ని, దాటుకుని నల్లమలకు చేరి ఉంటుందని వెల్లడిం చారు..

Previous హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పై కేసు నమోదు
Next హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పై కేసు నమోదు
ADVERTISEMENT